Home » వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

by Bunty
Ad

మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. అలాంటి మెగా ఫ్యామిలీలో నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికీ ఆయన బ్యాచిలర్ గానే ఉన్నారు.

Advertisement

అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠి తో వరుణ్ ప్రేమ వ్యవహారం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం అందుతుంది. మెగా ఫ్యామిలీతో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందట. ఆ తర్వాత లావణ్య, వరుణ్ తమ రిలేషన్ ను అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం అందుతుంది.

Advertisement

అయితే ఈ వార్తలను నిజం చేస్తు… మరో ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది. ఈ జంట పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని, జూన్ లో వీరి నిశ్చితార్థం జరగనుందనేది ఆ వార్తల సారాంశం. అయితే ఈ న్యూస్ మీడియాలో ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ తాజా ఈవెంట్ లో వరుణ్ చెల్లెలు నిహారిక కొనిదెలకు ఇదే ప్రశ్న ఎదురవగా… స్పందించేందుకు నిరాకరించింది. ఇక దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

SSMB 28 కోసం మూడు టైటిల్స్‌.. అమరావతికి ఓకే చెబుతారా!

Visitors Are Also Reading