Home » SSMB 28 కోసం మూడు టైటిల్స్‌.. అమరావతికి ఓకే చెబుతారా!

SSMB 28 కోసం మూడు టైటిల్స్‌.. అమరావతికి ఓకే చెబుతారా!

by Bunty
Ad

ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏజ్ బార్ అయినప్పటికీ… టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా… టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు… అనేక సంచలన విజయాలను సాధించి అగ్ర హీరో గా కొనసాగుతున్నాడు.

Advertisement

ఇక రెండేళ్ల కిందట సరిలేరు నీకెవ్వరు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb 28 పేరుతో కొత్త సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే… రెండో హీరోయిన్ గా శ్రీ లీలా అని ప్రచారం.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ఏంటో అనేది త్రివిక్రమ్ ప్రకటించలేదు. అయితే తాజాగా దీనిపై ఓ వార్త వైరల్ అవుతుంది.

Advertisement

ఈ సినిమాకు మూడు టైటిల్ ఫిక్స్ అయ్యారని… అందులో ఒకటి ఫైనల్ కాను ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఊరికి మొనగాడు, గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు అనే టైటిల్స్ ను అనుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో ఏ టైటిల్ ను త్రివిక్రమ్ తీసుకుంటాడోనని… మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇంకా ఈ సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్నాడు.

 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

 

SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది

 

 

Visitors Are Also Reading