Home » మహేష్ బాబు పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య బాబు

మహేష్ బాబు పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య బాబు

by Anji
Ad

నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ ముగింపు ద‌శ‌కు చేరుకున్న‌ది. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాప‌బుల్ తాజా సీజ‌న్ త్వ‌ర‌లో ఎండ్ కాబోతుంది. ఇక చివ‌రి ఎపిసోడ్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఎప్పుడు ఎప్పుడా అని ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కుల ఎదురుచూపులు ఫ‌లించాయి. ఫిబ్ర‌వ‌రి 04న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న‌ది. ఈ త‌రుణంలోనే ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ స్పెష‌ల్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేసారు.

Advertisement

మొద‌టి నుంచి మ‌హేష్‌-బాల‌య్య కాంబినేష‌న్‌లో ఎపిసోడ్‌పై అభిమానుల అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే తాజాగా స్పెష‌ల్ ప్రోమోతో ఇంకా అవి రెట్టింప‌య్యాయి. బాల‌య్య పంచ్‌లు, మ‌హేష్ సెటైర్ల‌తో ఈ ఎపిసోడ్ ఉండ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇంత యంగ్ గా ఉన్నావేంట‌య్య బాబూ అని బాల‌కృష్ణ అడ‌గ‌డంతో మొద‌లైన ప్రోమో ఆద్యంతం న‌వ్వులు పూయించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు మ‌హేష్ మూడేళ్లు గ్యాప్ తీసుకోవ‌డం.. దానికి కార‌ణం అడిగే కొద్ది ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చారు బాల‌య్య‌. ఆ త‌రువాత మ‌హేష్ నాదొక చిన్న కోరిక అని, నా డైలాగ్ నీ గొంతులో వినాల‌ని ఉంది. అని బాల‌కృష్ణ అడ‌గడం.. మీ డైలాగ్ మీరు త‌ప్ప ఇంకెవ్వ‌రూ చెప్పలేరు సార్ అని మ‌హేష్ చెప్ప‌డం క‌వ‌ర్ చేస్తున్నావ్ అని బాల‌య్య పంచ్ వేయ‌డం న‌వ్వుల‌ను పూయిస్తోంది.

Advertisement

ఇక చివ‌ర‌లో వెకేష‌న్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్‌. ఏమిటి ఆ సీక్రెట్..? అని పంచ్ వేయ‌గా.. మ‌హేష్ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ అదిరిపోయింది. మ‌హేష్ పెళ్లి అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం అని చెప్పాలి. వంశీ చిత్ర స‌మ‌యంలో న‌మ్ర‌త‌తో ప్రేమ‌లో ప‌డిన మ‌హేష్‌.. ఇంట్లో ఒప్పించ‌డం వెంట‌నే ఆమెను పెళ్లాడ‌డం జ‌రిగిపోయాయి. అయితే అప్ప‌ట్లో మ‌హేష్ పెళ్లి సీక్రెట్ గురించి చాలా పుకార్లు వ‌చ్చాయి. మ‌రి ఆ పుకార్ల‌కు మ‌హేష్ ఈ షోలో చెక్ పెడ‌తాడా..? లేదా అనేది చూడాలి మ‌రి.

Also Read : తమిళ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ ప్ర‌మోష‌న్స్‌.. ఏమిటో విశేషం..?

Visitors Are Also Reading