Home » తమిళ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ ప్ర‌మోష‌న్స్‌.. ఏమిటో విశేషం..?

తమిళ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ ప్ర‌మోష‌న్స్‌.. ఏమిటో విశేషం..?

by Anji

తెలుగు ఇండ‌స్ట్రీనే కాదు.. మొత్తం సినీ పరిశ్ర‌మ‌కే అతిలోక సుంద‌రిగా పేరు తెచ్చుకున్న‌ది. శ్రీ‌దేవి. సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి త‌న‌దైన ముద్ర వేసుకునే చేసిన శ్రీ‌దేవి. ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాల‌ను అందించి వెళ్లిపోయింది. అలాంటి శ్రీ‌దేవి త‌న కూతుళ్లు జాన్వీ, ఖుషీల‌ను హీరోయిన్లుగా చూడాల‌ని చాలా ఆశించింది. కానీ ఆ కోరిక తీర‌కుండానే క‌న్ను మూసింది. శ్రీ‌దేవి మృతి చెందిన త‌రువాత త‌న వార‌సురాలుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రి ఇచ్చింది జాన్వీక‌పూర్. త‌న తండ్రి సాయంతో బాలీవుడ్‌లోని మ‌రికొంద‌రి స‌పోర్ట్‌తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది.

ఇప్పుడిప్పుడే మంచి స్క్రిప్ట్స్‌ను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లుతుంది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. శ్రీ‌దేవి కూతురు అనే మార్క్ త‌న‌పై ప‌డిపోయింది. అయితే కొంత‌కాలం క్రితం సౌత్ లో కూడా అడుగుపెట్టాల‌న్న ప్లాన్‌లో ఉన్న‌ద‌ట జాన్వీ. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో ఎన్టీఆర్‌తో జాన్వీక‌పూర్ సినిమాలు చేయ‌నున్న‌ద‌ని అప్ప‌ట్లో విప‌రీతంగా రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.

కానీ అవేమి నిజాలు కాదు అని తేలిపోయింది. పైగా జాన్వీ తండ్రి బోణి క‌పూర్ కూడా త‌న‌ను సౌత్‌కు పంప‌డానికి అంత‌గా ఆసక్తి చూపించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసారు. కానీ ప్ర‌స్తుతం ఓ రూమ‌ర్ తెర‌పైకి వ‌చ్చింది. అజిత్ హీరోగా తెలుగు హీరో కార్తీకేయ నెగిటివ్ రోల్‌లో న‌టిస్తున్న చిత్రం వాలిమై, నేర్కొండ పార్వై లాంటి హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు హెచ్‌. వినోద్‌కు వాలిమైతో మ‌రొక అవ‌కాశాన్ని అందించాడు అజిత్‌. ఈ చిత్రాన్ని బోణిక‌పూర్ నిర్మిస్తున్నాడు.

Also Read : IPL 2022 : గ‌త ఏడాది వికెట్ తీస్తే రూ.1.66 కోట్లు.. ఈ ఏడాది ఆ భౌల‌ర్ ప‌రిస్థితి ఏమిటంటే..?

Visitors Are Also Reading