Home » “ఆమె” సినిమాలో ఆ సీన్లు డిలీట్ చేశారని ప్రేక్షకులు ఎందుకు ధర్నాకు దిగారు ..? ఆ సీన్ ఏంటి..!

“ఆమె” సినిమాలో ఆ సీన్లు డిలీట్ చేశారని ప్రేక్షకులు ఎందుకు ధర్నాకు దిగారు ..? ఆ సీన్ ఏంటి..!

by AJAY
Published: Last Updated on
Ad

ఒకప్పటి స్టార్ డైరెక్టర్లలో ఇవివి సత్యనారాయణ కూడా ఒకరు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు తీసి ఇ.వి.వి.సత్యనారాయణ సూపర్ హిట్స్ అందుకున్నారు. జగపతిబాబు, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ లాంటి హీరోలతో సూపర్ హిట్ లు అందుకున్నారు. ఇవివి దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్స్, ఆలీబాబా అరడజను దొంగలు, అబ్బాయిగారు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

Also Read: రామ్ గోపాల్ వర్మ పై రాజాసింగ్ ఫైర్…వేస్ట్ ఫెలో అంటూ దారుణమైన కామెంట్స్….!

Advertisement

అంతేకాకుండా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ఆమె అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఊహ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మధ్య తరగతి జీవన విధానానికి అద్దం పట్టినట్టుగా కనిపిస్తుంది. దాంతో ఈ సినిమా చాలా మంది కి కనెక్ట్ అయింది. సినిమాలోని సీన్లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.

Also Read: షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. ఎందుకోస‌మంటే..?

Advertisement

ఈ సినిమాలో కామెడీ తో పాటు సెంటిమెంట్, మధ్యతరగతి జీవితంలో వచ్చే కష్టాలను సైతం చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అహ నా పెళ్ళంట సినిమా లో కోట పిసినారి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు పిసినారి పాత్రలో కనిపిస్తారు.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఆడది అంటే అబల కాదు సబల అంటూ కోట శ్రీనివాసరావును భార్యగా నటించిన సుధా అతడి గుండెలపై కాళ్లు పెట్టి కత్తితో బెదిరిస్తుంది. ఈ సీన్ తెరకెక్కించేటప్పుడు బాగుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేసిన తర్వాత ఆ సీను కట్ చేశారు. అయితే విజయవాడలోని ఓ థియేటర్ లో ఆ సీన్ ప్రదర్శించకపోతే సినిమాను నిలిపివేస్తామని ప్రేక్షకులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి సుధ ఇంటర్వ్యూలో తెలిపారు. అంటే ఆ సీన్ ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: వండ‌ర్ హౌస్‌.. ఎన్ని వ‌ర‌ద‌లు సంభ‌వించినా ఆ ఇంటికి మాత్రం ఏం కాదు..!

Visitors Are Also Reading