Telugu News » Blog » షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. ఎందుకోస‌మంటే..?

షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. ఎందుకోస‌మంటే..?

by Anji

సాధార‌ణంగా సెల‌బ్రెటీలు అంటేనే ఒక ప్ర‌త్యేక ఇమేజ్ ఉంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే వారి ఇమేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువ‌నే చెప్పాలి. అప్పుడ‌ప్పుడు వారిపై ట్రోలింగ్స్ జ‌రుగుతుంటాయి. ఇక స్టార్ హీరోలు అయినా, హీరోయిన్స్ అయినా వారి పిల్ల‌లు అయినా ట్రోలింగ్ కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో వారు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో చాలా జాగ్రత్త‌గా ఉండడం బెట‌ర్‌. ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా జ‌నాల‌కు దొరికిపోతారు. దీంతో ట్రోలిగ్ మ‌రింత ఎక్కువ‌గ అవుతుంది. సుహానా ఖాన్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఇలాగే కొన‌సాగుతుంది.

సుహానాఖాన్ అంటే ఎవ‌రో కాదండోయ్ బాలీవుడ్ స్టార్ హీరో స్టార్ షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్‌. ఇంకా సినిమాల్లోకి ఆమె ఎంట్రి ఇవ్వ‌లేదు. వ‌చ్చే ఏడాది ఓ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. తాజాగా ఒక చోట ఈమె బ‌య‌ట క‌నిపించింది. దీంతో ఆమె ద‌తో ఫోటోలు దిగేందుకు కొంద‌రూ అభిమానులు ఎగ‌బ‌డ్డారు. సుహానా అంటూ ప‌లువురు పిలిచారు. కానీ ఆమె వారిని అస‌లు పట్టించుకోలేదు. క‌నీసం వెన‌క్కి తిరిగి కూడా చూడ‌లేదు. ఇక సుహానాఖాన్ వైఖ‌రి పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అంత పొగ‌రు ఎందుకు అని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు.

సుహానాఖాన్‌కు చెందిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ప్ర‌ధానంగా నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్స్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు. అభిమానులు, ఫోటోలు అడిగితే అంత పొగ‌రు ఎందుకు సుహానా అని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపిస్తున్నారు. సుహానాఖాన్ ప్ర‌స్తుతం ది ఆర్చీస్ మూవీలో న‌టిస్తున్న‌ది. దీనికి జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రీమా కాట్గి స‌హ నిర్మాత . టైగ‌ర్ బేబి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే సంవ‌త్స‌రంలో విడుద‌ల‌వ్వ‌నుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

Also Read : 

“ఆమె” సినిమాలో ఆ సీన్లు డిలీట్ చేశారని ప్రేక్షకులు ఎందుకు ధర్నాకు దిగారు ..? ఆ సీన్ ఏంటి..!

త్రిష నుండి రష్మిక వరకు ఎంగేజ్ మెంట్ తరవాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సెలబ్రిటీలు వీళ్ళే…!

 

You may also like