Home » వండ‌ర్ హౌస్‌.. ఎన్ని వ‌ర‌ద‌లు సంభ‌వించినా ఆ ఇంటికి మాత్రం ఏం కాదు..!

వండ‌ర్ హౌస్‌.. ఎన్ని వ‌ర‌ద‌లు సంభ‌వించినా ఆ ఇంటికి మాత్రం ఏం కాదు..!

by Anji
Ad

ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌ల కోట్ల ఆస్తి న‌ష్టం జ‌రుగుతోంది. అందులో ప్ర‌ధానంగా ఇల్లు కూలిపోవ‌డం వంటివి జ‌రుగుతూనే ఉంటాయి. అయితే ఎప్ప‌టి నుంచో ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఈ స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం ల‌భించిందంటున్నారు జ‌ప‌నీస్ హౌసింగ్ డెవ‌ల‌ప‌ర్ ఇంజినీర్లు. ప్ర‌జ‌ల ఇండ్ల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌కుండా వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇండ్లు కొట్టుకుపోకుండా ఉండ‌డానికి ఒక స‌మాధానాన్ని క‌నుగొన్న‌ట్టు చెబుతున్నారు. జ‌పాన్‌కు సంబంధించిన టీబీఎస్‌టీవీ చాన‌ల్లో దీనికి సంబంధించి ప్రాసారం చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


ఇంత‌కు ఆ వీడియోలో అస‌లు ఏముంది..? ఇల్లు సాధార‌ణంగా క‌నిపిస్తుంది. దాని చుట్టూ నీరు పెర‌గ‌డంతో ఒక్క‌సారిగా అది నేల నుంచి కొన్ని అంగుళాలు తేలుతూ క‌నిపిస్తుంటుంది. అదేమిటి ఇల్లు తేలియాడ‌డం ఏమిట‌ని చూసిన వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అస‌లు విష‌యం ఏమిటంటే జ‌ప‌నీస్ హౌసింగ్ డెవ‌ల‌ప‌ర్ సంస్థ వ‌ర‌ద దాటికి ఇల్లు కొట్టుకుపోకుడా అందుకు అనుగుణంగా ఉండే ఇండ్ల‌ను నిర్మించారు. దానికి సంబంధించిన వీడియో డెమోన ఇది. ఇక ఆ ఇంటిని చాలా మంద‌మైన ఇనుప క‌డ్డీల‌ను నిర్మాణంలో ఉప‌యోగించ‌డం ద్వారా అవి నీరు ప్ర‌వ‌హిస్తున్న‌ప్పుడు తేలుతూ ఉండేవిధంగా చేస్తుంది.

Advertisement

Advertisement

నీరు త‌గ్గిన‌ప్పుడు ఆ ఇల్లు తిరిగి దాని అస‌లు స్థితికి చేరుకుంటుంది. దీంతో వ‌ర‌ద‌ల్లో ఇంటికయ్యే డ్యామేజ్ కాకుండా వ‌ర‌ద ధాటికి కూలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ప్లంబింగ్ లో ప్ర‌త్యేక వాల్వ్ అమరిక కూడా ఉండ‌టంతో ఇంట్లోకి నీరు రాకుండా అవి అడ్డుకుంటాయి. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ దీని నిర్మాణానికి మాత్రం పెద్ద‌గా ఖ‌ర్చు కాదని సంస్థ ప్ర‌తినిధులు పేర్కొంటున్నారు.

Visitors Are Also Reading