Home » ఐపీఎల్ చరిత్రలో నాల్గో ఆటగాడిగా ఉమ్రాన్ మాలిక్‌ రికార్డు…!

ఐపీఎల్ చరిత్రలో నాల్గో ఆటగాడిగా ఉమ్రాన్ మాలిక్‌ రికార్డు…!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 మెగవేలం ముందు ఉమ్రాన్ మాలిక్‌ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకుంది. ఎందరో గొప్ప ప్లేయర్స్ ను వదిలేసిన సన్ రైజర్స్ ఉమ్రాన్ ను రిటైన్ చేసుకోవడం చర్చగా మారింది. ఇక ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత మొదటి మూడు మ్యాచ్ లలో మాలిక్ రాణించకపోవడంతో ఆరెంజ్ ఆర్మీ పై విమర్శలు వచ్చాయి.

Advertisement

కానీ గత రెండు మ్యాచ్ లా నుండి ఉమ్రాన్ మాలిక్‌ చెలరేగుతున్నాడు. కేకేఆర్ పై హైదరాబాద్ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన… మాలిక్ ఈరోజు పంజాబ్ పై కూడా చెలరేగాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లో వేసి కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి… 4 వికెట్లు తీసుకున్నాడు.

Advertisement

ఈ క్రమంలోనే అతను ఓ అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్ ఇన్నింగ్స్ లో మాలిక్‌ వేసిన ఆఖరి ఓవర్ మేడిన్ ఓవర్ గా నిలిచింది. ఈ ఓవర్ లో మొదటి బాల్ డాట్ కాగా.. ఆ తర్వాతి బాల్ కు వికెట్ పడింది. మళ్ళీ ఆ తర్వాత బాల్ డాట్ కాగా.. ఆ తర్వాతి రెండు బంతులకు కూడా వికెట్ పడింది. ఇక ఆఖరి బంతికి కూడా వికెట్ పడగా… అది రన్ ఔట్ కాగా… మాలిక్‌ హ్యాట్రిక్ మిస్ అయ్యింది. దాంతో ఐపీఎల్ లో చివ‌రి ఓవ‌ర్‌ను మేడిన్ చేసిన నాలుగో బౌల‌ర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. ఉమ్రాన్ మాలిక్ కంటే ముందు ఇర్ఫాన్ ప‌ఠాన్, లసిత్ మలింగా, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ ఈ రికార్డును సాధించారు.

ఇది కూడా చదవండి :

ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?

వరుసగా నాలుగో విజయంతో సన్ రైజర్స్ హవా…!

Visitors Are Also Reading