Home » పాకిస్థాన్ ఆటగాళ్ల పై ఉమ్రాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్… పొరపాటున కూడా..!

పాకిస్థాన్ ఆటగాళ్ల పై ఉమ్రాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్… పొరపాటున కూడా..!

by Azhar
Ad

ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్ కు ప్రపంచ వ్యాళతంగా క్రికెట్ లో మంచి పేరు వచ్చింది. నిలకడ 150 కీ.మీకీ వేగం తగ్గకుండా బౌలింగ్ చేసే ఉమ్రాన్ పై చాలా మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కిడా కురిపించారు. కానీ స్పీడ్ హోం పాటుగా కొంచెం లైన్ అండ్ లెంగ్త్ చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటె ఉమ్రాన్ ను ప్రశంసించిన వారిలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా ఉన్నాడు. బ్రెట్ లీ ఉమ్రాన్ స్పీడ్ ను మెచ్చుకుంటూ అతని యాక్షన్ చూస్తే నాకు.. పాకిస్థాన్ బౌలర్ వాకర్ యూనిస్ గుర్తుకు వస్తున్నాడు అని కామెంట్స్ చేసాడు.

Advertisement

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన ఈ జమ్మూ స్పీడ్ గన్ ను తనను పాకిస్థాన్ బౌలర్ తో పోల్చడం పై తన అభిప్రయం అడగగా.. తాను ఎప్పుడు ఈ విషయం పై ఆలోచించలేదు అని చెప్పాడు. అలాగే తాను ఎన్నడూ కూడా పాకిస్థాన్ బౌలర్లను చూడలేదని.. కనీసం పొరపాటున కూడా వారి గురించి ఆలోచించలేదు అని అన్నారు. తనకు ఏ పాకిస్థాన్ లెజెండ తెలియదు అని చెప్పిన మాలిక్ నా జీవితంలో నేను కొలిచే బౌలర్లు కేవలం ముగ్గురు మాత్రమే.

Advertisement

నేను జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఈ ముగ్గురుని చూసే ఇన్స్పైర్ ఆయను అని చెప్పాడు. ఈ క్రమలో పాకిస్థాన్ ఆటగాళ్ల గురించి ఉమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటె.. ఐపీఎల్ లో ఉమ్రాన్ ప్రదర్శనకు ఫిదా అయిన బీసీసీఐ సెలక్టర్లు ఈ నెల 9 నుండి ఇండియా వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరగనున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు ఎంపిక చేసారు. చూడాలి మరి ఈ సిరీస్ లో ఉమ్రాన్ కు తుది జట్టులో చోటు వస్తుందా.. లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ, రోహిత్, రాహుల్ పై కపిల్ దేవ్ సీరియస్.. వారిని జట్టులోనుండి తీసేయండి…

దీపక్ చాహర్ పెళ్ళిలో ఆ క్రికెటర్ ను చూసి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading