Home » కోహ్లీ, రోహిత్, రాహుల్ పై కపిల్ దేవ్ సీరియస్.. వారిని జట్టులోనుండి తీసేయండి అంటూ..!

కోహ్లీ, రోహిత్, రాహుల్ పై కపిల్ దేవ్ సీరియస్.. వారిని జట్టులోనుండి తీసేయండి అంటూ..!

by Azhar
Ad

ప్రస్తత భారత జట్టు బ్యాటింగ్ లైనప్ లో బాగా పేరు తెచ్చుకుంది.. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్. కానీ ఈ ముగ్గురి పై ఇండియాకు మొదటి ప్రపంచ కప్ 1983 లో తెచ్చిన కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని జట్టు నుండి తీసేయాలని కామెంట్స్ చేసారు. వీరి వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా ఉంది అని పేర్కొన్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కపిల్ దేవ్ మాట్లాడుతూ… భారత జట్టు బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్, రాహుల్ చాలా కీలకమైన ఆటగాళ్లు. కానీ జట్టుకు అవసరమైన సమయంలో వీరు ఉండరు.

Advertisement

ఈ ముగ్గురుకి 150 కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. కానీ చేయడం లేదు. వరుసగా విఫలమవుతున్నారు. జట్టుకు సరిగ్గా కావాల్సిన సమయంలో ఒత్తిడిలో సరిగ్గా ఆడటం లేదు. ఈ ప్రభావం జట్టు మొత్తం మీద కూడా పడుతుంది. వీరిలో కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో బాగానే రాణించిన చాలా స్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ కారణంగానే ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూర్ చేతిలో లక్నో జట్టు ఓడిపోయింది. పరిస్థితి తగ్గట్లుగా రాహుల్ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు.

Advertisement

కోహ్లీ, రోహిత్ పరిస్థితి కూడా అలానే ఉంది. సీనియర్లుగా ముందు ఉండాల్సిన సమయంలో వీరు ఉండటం లేదు. అందుకే ఓడిపోవాల్సి వస్తుంది. బాగా ఫెమస్ అయ్యి పేరు సంపాదించడం మాత్రమే కాకుండా.. అందుకు తగ్గినట్లు ఆట కూడా ఆడాలి. అలా ఆడలేకపోతున్నప్పుడు వీరు జట్టులో ఉండటం అనవసరం. ఇప్పుడు యువకులు బాగా ఆడుతున్నారు. కాబట్టి వీరిని జట్టులోనుండి తీసేసి యంగ్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇవ్వండి అంటూ కపిల్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

అర్జున్ టెండూల్కర్ కు కపిల్ దేవ్ సూచనలు.. మీ నాన్నలో సగం ఆడినా..?

దీపక్ చాహర్ పెళ్ళిలో ఆ క్రికెటర్ ను చూసి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading