Home » దీపక్ చాహర్ పెళ్ళిలో ఆ క్రికెటర్ ను చూసి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

దీపక్ చాహర్ పెళ్ళిలో ఆ క్రికెటర్ ను చూసి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

by Azhar
Ad

భారత యువ పీసా దీపక్ చాహర్ ఈ నెల 2న ఓ ఇంటివాడు అయిన విషయం తెలిసిందే. తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న జయ భరధ్వాజ్ కు గత ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో దీపక్ ప్రపోజ్ చేసాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. లక్నోలో కుటుంబ సభ్యుల ముందు దీపక్ జయను పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి రిసెప్షన్ ఏర్పాటు చేసాడు దీపక్. ఇందులో చాలా మంది క్రికెటర్లు హాజరయ్యారు. కానీ అందులో ఓ ఆటగాడి చూసి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Advertisement

తాజాగా దీపక్ చాహర్ రిసెప్షన్ లోనే ఓ ఫోటో సొసైల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో కొత్త పెళ్లి కొడుకు దీపక్ తో పాటుగా శార్దూల్ ఠాకూర్, అర్ధదీప్ సింగ్, కరణ్ శర్మ, రిషప్ పంత్, రవి బిష్ణోయ్, ఇషాన్ కిషన్ ఇలా ఇంత మంది భారత ఆటగాళ్లతో పాటుగా పాకిస్థాన్ ప్లేయర్ హసన్ అలీ కూడా ఉన్నాడు. దాంతో ఈ ఫోటోను ట్రోల్ చేస్తున్నారు. భారత అభిమానులు. అసలు వీడిని ఎవరు పిలిచారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఫ్యాన్స్ పప్పులో కాలు వేస్తున్నారు. ఎందుకంటే వారు హాసన్ అలీ అనుకుంటున్న ఆ ఆటగాడు అతను కాదు. అతను మన భారత పేసర్ ఐపీఎల్ లో ఢిల్లీకి అడవుతున్న ఖలీల్ అహ్మద్.

Advertisement

భారత్ – పాకిస్థాన్ అంటేనే ఉప్పు నిప్పుల ఉంటుంది వ్యవహారం. దానికి తోడు గత టీ20 ప్రపంచ కప్ లో టీం ఇండియా పైన విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ చేసిన ఓవరాక్షన్ భారత అభిమానులు ఇంకా మరిచిపోలేదు. అలాగే అక్కడి ఆటగాళ్లు ఎప్పుడు మనకు వ్యతిరేకంగానే వ్యవరిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఓ పాక్ ఆటగాడు భారత ఆటగాడి రిసెప్షన్ లో దర్శనం ఇవ్వడం పెద్ద చర్చగా మారింది. కానీ ఆ తర్వాత అసలు నిజం తెలుసుకొని అభిమానులు కొంత కూల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

అర్జున్ టెండూల్కర్ కు కపిల్ దేవ్ సూచనలు.. మీ నాన్నలో సగం ఆడినా..?

యువరాజ్ కెప్టెన్ అయితే నా కెరియర్ నాశనం అయ్యేది అంటున్న హర్భజన్…!

Visitors Are Also Reading