Home » Ugram movie review:ఉగ్రం మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా..?

Ugram movie review:ఉగ్రం మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా..?

Ad

Ugram movie review: ఒకప్పుడు కామెడీ సినిమాలు అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది అల్లరి నరేష్ మాత్రమే. అలాంటి అల్లరి నరేష్ ప్రస్తుతం కామెడీ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి యాక్షన్ సినిమాలకు స్వాగతం పలికారు. ఇందులో కూడా దూసుకుపోతున్నారు. గమ్యం, శంభో శివ శంభో,మహర్షి, నాంది ఇలాంటి సినిమాలు నరేష్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొస్తున్నాయి. దీంతో నరేష్ పూర్తిగా పవర్ ఫుల్ పాత్రలు ఉండే క్యారెక్టర్లు చేస్తున్నాడు. ప్రస్తుతం ఉగ్రం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా తన పర్ఫామెన్స్ చూపించారు.. మరి సినిమా కథ మూవీ ఎలా ఉందో చూద్దామా..

also read:శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు… చేస్తే అనర్థమే…!!

Advertisement

కథ:
ఈ సినిమా ఒక క్రైమ్ బేస్ చేసుకొని నడుస్తుంది. నేరాలు చాలా పెరిగిపోతున్న టైంలో ఆడపిల్లలు, పెళ్లయిన మహిళలు పెద్ద మొత్తంలో కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాను సీఐ శివకుమార్ ( అల్లరి నరేష్ ) ఫ్యామిలీ కూడా బలవుతుంది. ఈ సమయంలోనే శివకుమార్ కు ఒక భయంకరమైనటువంటి నేపథ్యం ఉంటుంది. శివకుమార్ ఎవరు. ఈ మాఫియాలు ఎలా చెక్ పెడతాడు. అనేది సినిమా చూస్తే తెలుస్తుంది..

నటీనటుల పర్ఫామెన్స్ :
పోలీసు రోల్స్ లో అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. సినిమా కోసం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మెప్పిస్తుంది. ఈ పాత్రలో ఒదిగిపోయి నటించగా ఆయనలోని కామెడీ యాంగిల్ అసలు ఎవరికీ గుర్తుకురాదు. ఇందులో అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నరేష్ భార్యగా మీరున బాగా నటించింది. డాక్టర్ పాత్రలో ఇంద్రజ మిగతా నటీనటులు కూడా మెప్పించారని చెప్పవచ్చు.

Advertisement

also read:ఒక్క స్టెప్పు, ఫైట్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య సినిమా… ఏంటంటే…?

టెక్నికల్:
ఇక టెక్నికల్స్ విషయానికి వస్తే దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగున్న , కథనాన్ని ఆయన నడిపించిన తీరు అంతగా ఎఫెక్ట్ గా అనిపించదు. మొదటి భాగం నెమ్మదిగా సాగుతుంది. లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత నుంచి లవ్ ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కాస్త బాగుంది. చివరికి మిస్టరీని సాల్వ్ చేయడం , ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. బిజిఎం పరవాలేదు, మిగతా టెక్నికల్ టీం కూడా బాగానే కష్టపడ్డట్టు తెలుస్తోంది.

 

ప్లస్ పాయింట్స్ :
అనుకోని ట్విస్టులు

నరేష్ పర్ఫామెన్స్

ఇంటర్వెల్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్ :

లవ్ స్టోరీ సీక్వెన్స్

మొదటి భాగం

స్లోగా వెళ్లే కథనం

చివరికి:
నాందిలో చేసిన పర్ఫామెన్స్ ఉగ్రం సినిమాతో నరేష్,విజయ్ రిపీట్ చేయలేకపోయారని చెప్పవచ్చు. కథ బాగానే ఉన్నా విజయ్ స్క్రీన్ ప్లేలో కాస్త డిసప్పాయింట్ చేశాడు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి మూవీ కాస్త టైం పాస్ గా ఉంటుందని చెప్పవచ్చు.

also read:“వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!

Visitors Are Also Reading