ప్రస్తుతం జనరేషన్ వాళ్లకి యాంకర్స్ అంటే సుమ, శ్రీముఖి, అనసూయ,రష్మీ, ఝాన్సీ, శ్యామల లాంటి వారు గుర్తుకు వస్తారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం యాంకరింగ్ అంటేనే ఉదయభాను పేరు వినబడేది. ఆమె వాయిస్,ఆమె అందం, యాంకరింగ్ ఎంత బాగుండేదో అప్పటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఉదయభాను యాంకరింగ్ కి కాస్త దూరమైపోయింది. కానీ తాజాగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త బిజీగా ఉంటోంది. అప్పటికి ఇప్పటికి సిచువేషన్స్ చాలా మారాయి.
ఇండస్ట్రీలోకి యాంకర్స్ కూడా చాలామంది వచ్చేసారు. కానీ ఉదయభాను ఫేమ్ మాత్రం కాస్త తగ్గిందని చెప్పవచ్చు. దీంతో ఆ పొయిన పేరుతో పాటుగా క్రేజ్ సంపాదించేందుకు సరికొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఆమెకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. త్వరలో మొదలయ్యే ఆరో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు ఒప్పిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం డిస్కషన్ లో ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.
ఇకపోతే ఉదయభాను క్రేజ్ దృష్ట్యా ఒక్కో వారానికి పారితోషికం కూడా భారీగానే ఇవ్వటానికి బిగ్ బాస్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఐదు సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకొని ఆరో సీజన్లో అడుగుపెట్టబోతుంది బిగ్ బాస్. ఈ మధ్య ఓటీటీ లో ఫస్ట్ సీజన్ కూడా పూర్తయింది. ఇకపోతే బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయని, సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
also read:
- సుమ క్యాష్ షో గురించి బయటపడ్డ అసలు నిజాలు.. ఏంటో తెలిస్తే షాకవుతారు..!!
- నడవలేని పరిస్థితిలో 750 సినిమాలు చేసిన స్టార్ నటుడు.. షాకైన మెగాస్టార్..!!