Home » నడవలేని పరిస్థితిలో 750 సినిమాలు చేసిన స్టార్ నటుడు.. షాకైన మెగాస్టార్..!!

నడవలేని పరిస్థితిలో 750 సినిమాలు చేసిన స్టార్ నటుడు.. షాకైన మెగాస్టార్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ పేరు చెబితే పరిచయం అక్కర్లేదని అంటారో ఆయనే కైకల సత్యనారాయణ. ఇప్పటికి 750 పైగా చిత్రాల్లో చేసి విభిన్నమైన పాత్రల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1959 లో డిఎల్ నారాయణరావు దర్శకత్వంలో సిపాయి కూతురు అనే మూవీలో ఒక పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో, సత్యనారాయణ గారికి పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ ఆయన చూడటానికి అచ్చం ఎన్టీఆర్ లాగా ఉన్నాడు కాబట్టి డూప్ గా బాగా పనికి వస్తాడని, ఆ పాత్రలు చేయడానికి అవకాశం లభించింది.

Advertisement

ఈ విధంగా విలన్ పాత్రలు, మరోపక్క తండ్రి, మామ, ఇలా అనేక పాత్రలు పోషించారు. అలాంటి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి సెలబ్రేట్ చేస్తారు. ఆయన బాగున్న రోజుల్లో చిరంజీవితో కలిసి నటించిన సినిమా అనుబంధం ఉంది. దీంతో సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి దగ్గరుండి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు పూర్తి ఆరోగ్యంతో మళ్లీ కోలుకొని అందరిని వెండితెరపై అలరించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియా వేదికగా మొదలవుతోంది.

Advertisement

దీన్ని చూసిన నెటిజన్లు చిరంజీవి మనస్తత్వం మంచిదంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కాని గత కొద్దిరోజుల నుంచి కైకాల సత్యనారాయణ అనారోగ్యం కారణంగా కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ మధ్య కాలంలో పూర్తి ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు అందరినీ కంగారు పెట్టేసేయ్. దీంతో తాజాగా ఆయనను చూసిన అభిమానులు షాకవుతున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ ఫోటోలు చాలామంది నెటిజన్లు చూసి ఆశ్చర్యపోతున్నారు.

ALSO READ:

భార్య భ‌ర్త‌ల మ‌ధ్య అస్స‌లు తెలియ‌కూడ‌ని విష‌యాలు ఇవే..? తెలిస్తే ఏం జ‌రుగుతుందంటే..

ఒకప్పుడు ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ లేదని సినిమాలో నుంచి తీసేసిన ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా ? ఆ సినిమా ఏదంటే ?

 

Visitors Are Also Reading