Home » సుమ క్యాష్ షో గురించి బయటపడ్డ అసలు నిజాలు.. ఏంటో తెలిస్తే షాకవుతారు..!!

సుమ క్యాష్ షో గురించి బయటపడ్డ అసలు నిజాలు.. ఏంటో తెలిస్తే షాకవుతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

యాంకర్ గా బుల్లితెరపై ఒక ఊపు, ఊపేస్తోంది సుమ కనకాల. ఈమె చేసే ప్రోగ్రామ్స్ ఒక ట్రెడ్ మార్క్ సంపాదించుకుంటాయి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుమ ప్రోగ్రాం అంటే చాలు హైయెస్ట్ టిఆర్పి రేటింగ్స్ తో దూసుకెళ్లి పోతుంది. అలా ఈ టీవీ ఛానల్ లో అత్యధిక ప్రేక్షక ఆదరణ పొందిన ప్రోగ్రాం ఏదయ్యా అంటే క్యాష్.. ఎంతో ఎంటర్టైన్మెంట్ తో ఉన్న ఈ ప్రోగ్రాం అంటే అందరికీ చాలా ఇష్టం. ఈ ప్రోగ్రాంకి ఎందరో సినీ సెలబ్రిటీలను గెస్ట్ లుగా పిలుస్తూ వారి చేత అలరిస్తూ ఉంటారు.

Advertisement

మరి ఈ ప్రోగ్రాం మీద ఎన్నో రకాల అపోహలు, ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్యాష్ ప్రోగ్రాం లో ఇచ్చే ప్రైజ్ మనీ నిజమైన డబ్బేనా, గెలిచి ఉంటే అన్ని డబ్బులు ఇస్తారా అలాగే ఎన్నో బహుమతులను కాస్లీ వస్తువులను చూపిస్తూ ఉంటారు. ఆ వస్తువులను పైనుంచి కిందకు పడేస్తూ ఉంటారు. ఆ షోలో జరిగేవి అన్ని స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయట, అందులో పాల్గొనే కంటెస్టెంట్ లకు ఇదంతా ముందే చెబుతారట. వారికి ఇచ్చేది నిజమైన క్యాష్ కాదు అది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే. అలాగే ఆ షోలో పాల్గొన్నందుకు వారికి డబ్బులు కూడా ఇవ్వరు.

Advertisement

చాలామంది తమకు తాము ప్రమోట్ చేయడానికి వస్తారట, అది వారికి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది సెలబ్రిటీలకు వారిని బట్టి ఐదు వేల నుంచి 20 వేల వరకు ఇస్తారట. అందులో కొంతమంది స్టూడెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. మరి వారికి డబ్బులు ఇస్తారా అంటే అదేం కాదట వాళ్లు స్టూడెంట్స్ కాబట్టి భోజనం పెట్టి పంపిస్తారట. ఎంతో అద్భుతంగా జరిగే ఈ షోలో జరిగేవి చూసేవి అన్ని కేవలం స్క్రిప్ట్ ప్రకారం ఉన్న కల్పితాలు మాత్రమే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ:

Visitors Are Also Reading