Home » ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం రూ.80కోట్ల కెమెరా.. భారీగానే కొరటాల ప్లాన్..!

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం రూ.80కోట్ల కెమెరా.. భారీగానే కొరటాల ప్లాన్..!

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత చేసే సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ చాలా ఆలస్యంగా మొదలు పెట్టినప్పటికీ ఈ సినిమా అప్పుడే నాలుగు షెడ్యూల్  పూర్తి చేసుకుందట. ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నాడట దర్శకుడు కొరటాల శివ . ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి  ‘వార్ 2’ చిత్రం చేయబోతున్నాడు. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ తీస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొరటాల శివ రెండు సార్లు రివర్క్  చేశాడట. కొడితే కుంభస్థలం బద్దలవ్వాలనే కసితో కథను సిద్ధం చేశాడట కొరటాల.

Advertisement

ఈ సినిమాలో పని చేసే తారాగణం కూడా భారీగానే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా అండర్ వాటర్ లో వీరిద్దరి మీద ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించాడట కొరటాల శివ. ఈ సన్నివేశం ఈ  సినిమాకే హైలెట్ కాబోతుందట. అంతేకాదు.. ఈ సినిమా కోసం ‘అర్రి అలెక్స్ LF’ అనే  కెమెరా ని ఉపయోగిస్తున్నారట. దీని ఖరీదు సుమారుగా 80 కోట్ల రూపాయల వరకు ఉంటుందనీ సమాచారం. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాను ఈ కెమెరా తోనే షూట్ చేశారట. దీంతో RRR స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా కూడా ఇదేనట. ఈ కెమెరాతో ఇప్పటివరకు జాన్ వీక్ 4, ది బ్యాట్ మ్యాన్, జోకర్, యాంట్ మ్యాన్, రేంజర్ కింగ్స్, డ్యున్, టెర్మినేటర్ వంటి హాలీవుడ్ సినిమాలను తెరకెక్కించారు.

Advertisement

ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయము తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్లో నటించబోతున్నాడట. అందులో ఒక పాత్ర పేరు దేవర. ఈ పాత్రనే సినిమాకి హైలెట్ కానున్నట్టు తెలుస్తోంది.  సముద్ర ఖనిజాలను స్మగ్లింగ్ చేసే పాత్రలో ఇందులో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. ముఖ్యంగా అండర్ వాటర్ లో వచ్చే పోరాట సన్నివేశాలు  ఈ సినిమాకు హైలెట్ కాబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ నట విశ్వరూపం మొత్తం ఈ సినిమాలో చూడవచ్చు అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ వచ్చే సమయానికి ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో సారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తారో లేదో చూడాలి మరి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

బాలకృష్ణ సినిమాకే నో చెప్పిన పాత హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో కింగ్ లా బ్రతికి అనాధల చనిపోయిన స్టార్స్ వీరే..!

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ప్రేమ కథ తెలుసా..? అంబానీ ఎలా ప్రొపోజ్ చేసారంటే..?

Visitors Are Also Reading