Home » పుష్ప 2 టీజర్ కి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

పుష్ప 2 టీజర్ కి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరమే లేదు. డిసెంబర్ 17, 2021న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అందరి మన్ననలను పొందింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి గుర్తింపును దక్కించుకుంది. త్వరలోనే పుష్ప 2 విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.  దాదాపు రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారట. కేవలం మేకింగ్ కోసం దాదాపు రూ.400 కోట్ల వరకు ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also Read :  ఫ్రిజ్ లో ఉంచిన పుచ్చకాయను తింటే ఏమవుతుందో తెలుసా ? 

Advertisement

Advertisement

త్వరలోనే పుష్ప 2 సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాబోతుంది. టీజర్ కోసం ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం, విజువల్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ చేస్తున్నారట. అందుకోసం రూ.2కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు  ఖర్చు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు టీజర్ కి అన్ని కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని పేర్కొంటున్నారు. మొత్తానికి పుష్ప 2 సినిమా స్థాయిని అమాంతం పెంచేవిధంగా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. సౌత్ ఇండియన్ భాషల్లో, హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Also Read :  అంత అందం ఉన్న బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాకపోవడానికి కారణం ఆ ఒక్కటేనా..?

Manam News

2024లో పుష్ప 2 విడుదల కాబోతుంది. టీజర్ విడుదల సమయంోల ఈ చిత్రం విడుదల తేదీ పై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ సినిమాలో రష్మిక మందన్న  శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. రెండో భాగంలో కూడా రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే పుష్ప 2 టీజర్ రాబోతుంది. పుష్ప 2 టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించాడు. పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Also Read :  రజినీకాంత్ ను ఆయన భార్య ఏం చూసి ఇష్టపడ్డారో తెలుసా…? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ..!

Visitors Are Also Reading