Home » ఘనంగా బుల్లితెర నటి వైష్ణవి వివాహం.. వరుడు ఎవరో తెలుసా..?

ఘనంగా బుల్లితెర నటి వైష్ణవి వివాహం.. వరుడు ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

దేవత సీరియల్ లో సత్య పాత్రలో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న నటి వైష్ణవి. ఈ సీరియల్ లో అక్క రుక్మిని బతికే ఉందన్న నిజం సత్యకు తెలియడంతో కథ ఉత్కంఠగా మారుతుంది. దేవత సీరియల్ లో ఈ పాత్ర చాలా పాపులర్ అయ్యింది. దీన్ని వైష్ణవి పోషించింది. అలాగే ప్రేమించిన ప్రియుడిని తన అక్క కొరకు త్యాగం చేసినటువంటి ప్రియురాలిగా, అదే ప్రియుణ్ణి తిరిగి వెళ్ళండి అంటూ సంసారానికి నోచుకోని భార్యగా ఎన్నో ఎన్నో పాత్రలు పోషించి సీరియల్స్ లో మంచి పేరు సంపాదించుకుంది బుల్లితెర నటి వైష్ణవి గాదె .తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని, చాలా సీరియల్స్ లో నటించి మెప్పించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె బుల్లితెరకు దూరమైంది. బుల్లి తెరకు దూరమైన కూడా యూట్యూబ్ ద్వారా చాలా మంది అభిమానులను అలరిస్తోంది. అయితే వైష్ణవి పెళ్లి పీటలు ఎక్కింది. మే 25వ తేదీన ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వైష్ణవి ఇంట మూడు రోజుల ముందు నుంచే పెళ్లి సందడి మొదలైందని చెప్పవచ్చు. ప్రముఖ బుల్లితెర దర్శకుడు సురేష్ తో ఆమె పెళ్లి హైదరాబాదులో ప్రముఖ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె వెడ్డింగ్ కు సంబంధించినటువంటి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో బ్రైడ్ లుక్ లో వైష్ణవి చాలా ఆకట్టుకుంటుంది. నూతన వధూవరులు ఇద్దరూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!

అయోమయంలో పడ్డ “ఆది పురుష్” చిత్ర యూనిట్.. కారణం ఇదేనా..?

 

Visitors Are Also Reading