Home » ‘నీ ప్రేమ పొందినందుకు రుణపడి ఉంటా’.. కోహ్లీ రికార్డు సెంచరీపై అనుష్క ఎమోషనల్‌ పోస్ట్..!

‘నీ ప్రేమ పొందినందుకు రుణపడి ఉంటా’.. కోహ్లీ రికార్డు సెంచరీపై అనుష్క ఎమోషనల్‌ పోస్ట్..!

by Anji
Ad

వరల్డ్ కప్ 2023లో టీమిండియా జోరు కనిపిస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన సెమిఫైనల్ లో విజయం సాధించి ఫైనల్ కి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డును బ్రేకు చేశాడు. మ్యాచ్ అనంతరం తన రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీని సచిన్ టెండూల్కర్ కౌగిలించుకొని  సంతోషం వ్యక్తం చేశాడు. ఇక సెంచరీ పూర్తి చేయగానే స్టేడియంలో ఉన్న తన భార్య అనుష్క వైపు చూస్తూ గాల్లో ముద్దులు విసిరేశాడు కోహ్లీ. ఇక మ్యాచ్ అనంతరం తన కోహ్లీపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అనుష్క. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఊహించినట్లుగానే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరుకుంది.

Advertisement

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై 70 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా గత ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్లయింది. భారత తరఫున బౌలింగ్ లో మహ్మద్ షమీ 7 వికెట్లు తీయగా, బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీలు సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ సాధించిన ఘనతపై ప్రపంచ క్రీడా దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ వేదికగా దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ నీ ప్రేమతో పాటు విరాట్ కోహ్లీ ప్రేమను ఆశీర్వదించినందుకు నేను కృతజ్ఞురాలిని. మనసులోనూ, ఆటపై నిజాయితీగా ఉండే నువ్వు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది అనుష్క.

Advertisement

ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో 117 పరుగులు చేయడం ద్వారా వన్డే ప్రపంచ కప్ లో ఒకే ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 2003లో సచిన్ 673 పరుగులు చేయగా, 2023 వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ 10 మ్యాచు ల్లో మొత్తం 711 పరుగులు చేశాడు. ఇక తన రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టడంపై సచిన్ స్పందిస్తూ.. నేను నిన్ను మొదటిసారి భారత డ్రెస్సింగ్ రూమ్ లో కలిసినప్పుడు ఇతర సహచరులు నాపాదాలను తాకి నమస్కరించాలని ప్రాంక్ చేశారు. నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ ఈరోజు నువ్వు నా మనసును తాకావు. అప్పటి చిన్న కుర్రాడు విరాట్ గా ఎదగడం చూసి చాలా సంతోషంగా ఉంది అని ట్రీట్ చేశాడు సచిన్.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading