Home » తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పరీక్ష తేదీలో మార్పు చేసిన TSPSC

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పరీక్ష తేదీలో మార్పు చేసిన TSPSC

by Bunty
Published: Last Updated on
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా డిసెంబర్ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే 833 అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 12, 2023న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టిఎస్పిఎస్సి కొన్ని రోజుల కిందట వేబ్ నోట్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ వంటి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా ఈ పరీక్ష తేదీల్లో మార్పు చేస్తూ టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది.

Advertisement

వెబ్ నోట్ ప్రకారం, ఫిబ్రవరి 12వ తేదీన గేట్ పరీక్ష ఉండటంతో దీనిని మరో తేదీకి పోస్ట్ పోన్ చేశారు. మార్చి 5, 2023న ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పరీక్షను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఈ పరీక్ష యొక్క అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే సమయానికంటే వారం రోజులు ముందు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో పాటు, ఇప్పటికే జనవరి 3, 2023న శిశు సంక్షేమ శాఖ నుంచి సిడిపిఓ పరీక్ష పూర్తికాగా జనవరి 8, 2023న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ కు సంబంధించి పరీక్షను నిర్వహించనున్నారు.

read also  : విజయ్ కి బిగ్ షాక్ “వారసుడు” స్టోరీ లీక్.. స్టోరీ కొత్తగా ఉందిగా !

 

Visitors Are Also Reading