తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. జనవరి 12న సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా పోస్టర్స్ చూసి మహర్షి సినిమా లాగా ఉంది అని అన్నారు.
Advertisement
READ ALSO : పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్
కానీ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక వార్త వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే విజయ్ రాజేంద్రన్ అనే ఒక వ్యక్తి చుట్టూ సినిమా తిరుగుతుంది. విజయ్ ఒక మామూలు వ్యక్తి. విజయ్ ని ఒక కుటుంబం దత్తత తీసుకొని పెంచుకుంటుంది. ఆ కుటుంబ పెద్ద మరణిస్తాడు. అప్పటివరకు వేరే ఎక్కడో ఉన్న విజయ్ ఇప్పుడు కుటుంబాన్ని కలవడానికి వస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఏమీ అనుకూలంగా అనిపించవు. ఉన్నట్టుండి విజయ్ ఒక వ్యాపారవేత్తగా మారాల్సి వస్తుంది.
Advertisement
తన అన్నలకి, తనకి మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలన్నీ విజయ్ ఎలా పరిష్కరించాడు అనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది. విజయ్ తండ్రి పాత్రలో శరత్ కుమార్ నటిస్తున్నారు. అలాగే విజయ్ అన్నల పాత్రల్లో శ్రీకాంత్, శ్యామ్ నటిస్తున్నారు. విజయ్ తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. విజయ్ కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీకి ఓనర్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ కథలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.
Advertisement
ఇవి కూడా చదవండి : ఓ కుక్కను రూ.20 కోట్లు పెట్టి కొన్న హైదరాబాద్ నివాసి.. దాని ప్రత్యేకతలు ఇవే