Telugu News » Blog » Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

by Bunty
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా నటుల జాతకాలు చెప్తూ చాలా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇటీవల కాలంలో ఆయన పేరు చాలా మార్మోగిపోతోంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అనగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది సెలబ్రిటీల జాతకాలు. సినీనటుల జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఆయన అప్పట్లో నాగచైతన్య సమంత ఎక్కువ కాలం వైవాహిక జీవితం ఉండదని చెప్పారు.

Advertisement

read also : TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

ఆయన చెప్పినట్లుగానే నాలుగు సంవత్సరాలు తిరగకముందే చైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రముఖ హీరోయిన్ అనుష్క, రకుల్,రష్మిక, వివాహం అచ్చి రాదంటూ కూడా వేణు స్వామి కామెంట్లు దుమారం లేపాయి. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కి సినీ కెరియర్ లో పెద్దగా ప్రస్తుతం అవకాశాలు లభించలేవు. అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు సోషియల్ మీడియాలో ఒక వీడియోతో వార్తలోకి వచ్చింది.

Advertisement

Venu Swamy

Venu Swamy

అదేమిటంటే, ఈ అమ్మడు ఇంట్లో వేణు స్వామి పూజ చేయటం. నిధి అగర్వాల్ ఇంట్లో రాజ శ్యామల పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది. వేణుస్వామి బృందం నిధి అగర్వాల్‌‌ ఇంట్లో పూజ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రసుత్తం వైరల్ అవుతోంది. నిధి అగర్వాల్‌ వేణుస్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేశారు. గతంలో రష్మిక మందన్న, కృతి శెట్టి వంటి వారు కూడా ప్రత్యేకంగా వేణు స్వామితో పూజలు చేయించిన తెలిసిందే. నిధి అగర్వాల్ పక్కనే కూర్చుని వేణు స్వామి ఈ పూజ చేయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement

READ ALSO : Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?

You may also like