Home » చలికాలంలో ఉదయం సమయంలో స్కిన్ కేర్ చిట్కాలు ఇలా ప్రయత్నించండి.. ఫలితం పక్కా..!

చలికాలంలో ఉదయం సమయంలో స్కిన్ కేర్ చిట్కాలు ఇలా ప్రయత్నించండి.. ఫలితం పక్కా..!

by Anji
Ad

ప్రస్తుతం చలికాలం కావడంతో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. తీవ్రమైన చలితో పిల్లల నుంచి పెద్దల వరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రధానంగా చలికాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చలికాలంలో చర్మ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు చక్కని ఫలితాలను ఇస్తాయి. చలికాలంలో ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు మీ ముఖాన్ని క్లీన్ గా కడుక్కోవాలి. 

Advertisement

ఇలా మీరు ముఖాన్ని కడుక్కోవడం వల్ల కచ్చితంగా మేకప్ ని తొలగించాలి. రాత్రి సమయంలో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని మురికి తొలగిపోతుంది. ముఖంపై మొటిమల సమస్య తగ్గిపోతుంది. చర్మ సంరక్షణలో భాగంగా సీరమ్స్ వాడకం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చలికాలలో చర్మ సంరక్షణకు సీరమ్ చాలా ఉపయోగపడుతుంది. మెరిసే చర్మానికి ఈ సీరమ్ చాలా మంచిది అని చాలా మంది భావిస్తున్నారు. చలికాలంలో రాత్రి సమయంలో ముఖం కడుక్కున్న తరువాత ముఖానికి సీరమ్ రాసుకోవాలి. సీరమ్ అప్లై చేయడం వల్ల మీ ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. అంతేకాదు.. మొటిమల సమస్య తగ్గిపోతుంది. సీరమ్ చాలా తేలికగా ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. అందుకోసమే రాత్రి సమయంలో చర్మ సంరక్షణ కోసం సీరమ్ అప్లై చేయడం ద్వారా మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. 

Manam News

Advertisement

ప్రధానంగా కాలుష్యం, హానికరమైన UV కిరణాల బారిన పడుతూ రోజూ మన చర్మం పలు కారణాల వల్ల పాడవుతుంటుంది. చలికాలంలో వారానికి రెండు లేదా మూడు సార్లు చక్కని ఫేస్ ఫ్యాక్ లేదా ఫేస్ మాస్క్ తో ప్రయత్నించండి. దీంతో మీ చర్మ ఛాయ మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా మీరు మెరిసే చర్మం కావాలంటే చలికాలంలో రాత్రివేళ మీ చర్మ సంరక్షణ కోసం మాయిశ్చరైజింగ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏ రకమైన చర్మం అయినా తేమను నిలుపు కోవడానికి మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ చర్మం పీహెచ్ స్థాయిని నిర్వహిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు తేలికపాటి నీటి ఆధారిత మాయిశ్చరైజర్ ని ఉపయోగించాలి. 

Also Read :  మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 కూరగాయలను తప్పక తీసుకోండి.. ఫలితం పక్కా..!

ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు తీసుకొని ఈ రెండింటిని పేస్ట్ మాదిరిగా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత కొద్దిగా నీరు చిలుకరించి మసాజ్ చేసుకోవాలి. బాదంలో ఉండేే విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్, పాలలోని మాయిశ్చరైజింగ్ గుణాలు వింటర్ స్కిన్ కేర్ కి చాలా అవసరం. చర్మాన్ని మృదువు గా మార్చుతాయి. మెరిసేవిధంగా చేస్తాయి. ఈ ఫేస్ ఫ్యాక్ వల్ల స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది.  

Also Read :  మీ దంతాలు మెరిసిపోవాలని గట్టిగా తోముతున్నారా..? అయితే సమస్యలు తప్పవు జాగ్రత్త ..!

Manam News

ఎండాకాలం అయినా, చలికాలం అయినా చర్మంపై ఎప్పుడూ సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి. ఇది ఎండ వేడి చర్మాన్ని రక్షించడమే కాకుండా చర్మాన్ని మురికి లేదా దుమ్ము నుంచి కూడా రక్షిస్తుంది. మంచి సన్ స్క్రీన్ కూడా గ్లో తీసుకొస్తుంది. సాధారణంగా చలికాలంలో చర్మం పగిలిపోతుంది. దురద, చికాకు, మంట పుడుతుంది. ఇలా ఉన్నట్టయితే గోరువెచ్చని నీటితో స్నానం చేసి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వినియోగించండి తప్పకుండా ఫలితం ఉంటుంది. 

Also Read :  అమ్మాయిలు అలర్ట్.. ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు..!

 

Visitors Are Also Reading