Home » మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 కూరగాయలను తప్పక తీసుకోండి.. ఫలితం పక్కా..!

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 కూరగాయలను తప్పక తీసుకోండి.. ఫలితం పక్కా..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా కొందరూ ఏం తినకుండానే చాలా లావుగా కనిపిస్తుంటారు. బరువు ఎక్కువగా ఉన్న వారు ఆ బరువును తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. పలు వ్యాయామాలు, కసరత్తులు, ప్రయత్నాలు చేసి విసుగెత్తిపోతారు. వాస్తవానికి బరువు తగ్గడానికి మన ఇంట్లోనే ఉండే కూరగాయలు చాలా బాగా సహాయపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఆహార నియమాల్లో అనేక నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. డైట్ పై శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ 5 రకాల కూరగాయలను నిత్యం తింటుంటే చాలు.. అనతి కాలంలోనే చాలా వరకు బరువు తగ్గుతారు. 

Advertisement

దోసకాయ 

Dosakaya

బరువు తగ్గాలనుకువారికి దోసకాయ చాలా ఉపయోగపడుతుంది. వాస్తవానికి దోసకాయలో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. శరీరంలో హైడ్రేషన్ స్థాయిని పెంచుతుంది. ప్రేగు కదలికను వేగవంతం చేస్తుంది. అదేవిధంగా కడుపు నిండినట్టు అనిపించి ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉండే ఫైబర్ మీ జీవక్రియను పెంచుతుంది. పేగుల్లో పేరుకుపోయిన కొవ్వును బయటికి తీయడం ద్వారా వేగంగా బరువు తగ్గడానికి సాయపడుతుంది.

పొట్లకాయ 

manam News

Advertisement

పొట్లకాయ బరువు తగ్గడానికి సరైన కూరగాయ. కూరగాయాల్లో 90 శాతం వరకు నీరు ఉంటుంది. ఇంతేకాకుండా.. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరానికి నిర్వీషికరణ చేయడంలో ఇది వేగంగా పని చేస్తుందని తద్వారా బరువు తగ్గడానికి పొట్లకాయ ఎంతో సహాయపడుతుంది. 

Also Read :  మీ దంతాలు మెరిసిపోవాలని గట్టిగా తోముతున్నారా..? అయితే సమస్యలు తప్పవు జాగ్రత్త ..!

బ్రోకలీ 

Broccoli

బ్రోకలీలో మంచి ప్రోటీన్లు అదేవిధంగా అధిక కేలరీలు ఉన్నాయి. దీనిని తినడం వల్ల మీ పొట్ట చాలా సమయం నిండుగా ఉంటుంది. ఇందులోని సూక్ష్మపోషకాలు బరువు తగ్గడంలో చాలా సహాయపడుతాయి. అందువల్ల బరువు తగ్గించే ఆహారంలో ఇది ఒక భాగం. 

బచ్చలికూర 

Bachali kura

పాలకూర తినడం ద్వారా మీరు నిజంగా బరువు తగ్గవచ్చు. ఇందులోని ప్రోటీన్ వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. దానిలోని ఫైబర్ ప్రేగు కదలికను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి బచ్చలికూరను తినండి లేదా సలాడ్ లో తక్కువగా వాడండి. 

Also Read :  మీ దంతాలు మెరిసిపోవాలని గట్టిగా తోముతున్నారా..? అయితే సమస్యలు తప్పవు జాగ్రత్త ..!

Visitors Are Also Reading