Home » నా 2% ఆస్తి విలువ రూ.400 కోట్లు.. ఆస్తి గుట్టు విప్పేసిన నారా భువనేశ్వరి

నా 2% ఆస్తి విలువ రూ.400 కోట్లు.. ఆస్తి గుట్టు విప్పేసిన నారా భువనేశ్వరి

by Bunty

తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. బలమైన ఆధారాలు చూపడంతో… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా త్వరలోనే అరెస్టు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఈ మధ్యకాలంలో మీడియాతో మాట్లాడుతున్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని.. ఏపీ ప్రజల కోసం నిత్యం పోరాడే జననాయకుడు జైల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలు తమ కుటుంబానికి అలాగే తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు నారా భువనేశ్వరి. అలాగే 370 కోట్ల స్కాం చంద్రబాబుపై అన్యాయంగా మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ తరుణంలోనే టంగ్ స్లిప్ అయిన భువనేశ్వరి…. తమ కుటుంబానికి చెందిన ఆస్తుల చిట్టాను బయటపెట్టింది.హెరిటేజ్ లోని తన వాటాలో కేవలం రెండు శాతం అమ్మితే క్షణాల్లో 400 కోట్లు వస్తాయని పేర్కొన్న భువనేశ్వరి…. మాకు ప్రజల సొమ్ము ఎందుకు అంటూ నిలదీసే ప్రయత్నం చేసింది. దీంతో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ… వైసీపీ కూడా విమర్శలు చేస్తోంది. కాగా అధికారిక లెక్కల ప్రకారం హెరిటేజ్ సంస్థలో భువనేశ్వరిది దాదాపుగా 40 శాతం వాటా ఉంది. ఈ లెక్కన భువనేశ్వరి పూర్తి వాటా విక్రయిస్తే… ఆమె సంపాదన సుమారుగా 15 వేల కోట్లుగా ఉంటుంది. ఇదే విషయాన్ని వైసిపి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అన్యాయంగా ప్రజల సొమ్మును చంద్రబాబు కుటుంబం మొత్తం కాజేస్తోందని మండిపడుతోంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading