Home » బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోబోతున్న త్రిష..!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోబోతున్న త్రిష..!

by Anji
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఊపు ఊపింది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత తమిళ్, మలయాళ, సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీకి ఇంకా హీరోయిన్ ఆఫర్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అలాంటి ఈమె సినీ కెరియర్ పరంగా దూసుకుపోతోంది కానీ పెళ్లి విషయంలో మాత్రం వెనకబడిపోయింది. మరి ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులంతా ఎదురు చూస్తూ ఉన్నారు.కానీ త్రిష పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

Advertisement

సినిమాలతో దూసుకుపోతూ రెండు చేతుల సంపాదిస్తోంది. అయితే త్రిష ఈ మధ్యకాలంలో నటించి విడుదలైన సినిమా పోన్నియన్ సెల్వన్ ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును అందించింది. చిత్రంలో కమలహాసన్, అజిత్ తో నటించిన ఈ బ్యూటీ తాజాగా సల్మాన్ ఖాన్ తో నటించేందుకు సిద్ధమవుతోందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్ తో “దిబుల్” అనే సినిమాను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 1988 ఆపరేషన్ కాక్టస్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట. ఇందులో ఫరోక్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా, అతని భార్య పాత్రలో త్రిష నటిస్తున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. ఇందులో త్రిష పాత్రకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ 2024 లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading