Home » ఈసారి దసరాకు ట్రయాంగిల్ ఫైట్.. బాలయ్య విజయం సాధించేనా ? 

ఈసారి దసరాకు ట్రయాంగిల్ ఫైట్.. బాలయ్య విజయం సాధించేనా ? 

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భగవంత్ కేసరి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఎంటర్టైన్ మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అయినటువంటి అనిల్ రావిపూడి మాస్ కి పెట్టింది పేరైన బాలయ్యల కాంబో కావడంతో సినిమా అందరిలో ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ డేట్ ని అనౌన్స్ చేసింది. 

Advertisement

తొలుత ప్రచారం జరిగినట్టుగానే అక్టోబర్ 19న ఈ సినిమాను విడుదల ఉంటుందంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. గీ సారి దసరా జోర్దారుంటది అని ప్రకటించారు. అనుకున్నట్టుగానే దసరాకి ఈ సారి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేయగా.. విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ రూపొందుతున్న లియో సినిమాని కూడా అక్టోబర్ 19న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు భగవంత్ కేసరి కూడా ఇదే రోజు ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనంగా మారింది. మాస్ మహారాజా రవితేజ, బాలయ్య సినిమాల మధ్య క్లాష్ ఏర్పడటం ఇది మొదటిసారి ఏం కాదు.

Advertisement

గతంలో ఒక్కమగాడు-కృష్ణ, మిత్రుడు-కిక్, పరమవీరచక్ర-మిరపకాయ్ వంటి సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఈ సమయంలో బాలకృష్ణ సినిమాలు అన్నీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రవితేజ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో నందమూరి అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అయినప్పటికీ కొంత మంది అభిమానులు మాత్రం ఈసారి సీన్ రివర్స్ అవుతుందంటూ పేర్కొంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు మధ్య పోటీలో బాలయ్య మూవీ బ్లాక్ బస్టర్ అయితే విజయ్ సినిమా మాత్రం తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరీ దసరాకి బాక్సాఫీస్ జరుగబోయే ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

గీసారి దసరా జోర్దారుంటది.. భగవంత్ కేసరి రిలీజ్ డేట్ వచ్చేసింది..!

గుంటూరు కారం మూవీలో మరో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతుంది..?

హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Visitors Are Also Reading