Home » గీసారి దసరా జోర్దారుంటది.. భగవంత్ కేసరి రిలీజ్ డేట్ వచ్చేసింది..!

గీసారి దసరా జోర్దారుంటది.. భగవంత్ కేసరి రిలీజ్ డేట్ వచ్చేసింది..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలను ఎక్కువగా పండుగలకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఇటీవలే సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ సాధించాడు.  తాజాగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇప్పటికే భగవంత్ కేసరి అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

Advertisement

షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని దసరా పండుగకి బరిలో నెలబెడుతూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 19న బాలయ్య-అనిల్ రావిపూడి మూవీ విడుదలవుతుందనే విషయాన్ని రివిల్ చేస్తూ “భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీసారి దసరా జోర్దారుంటది” అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. బాలయ్య ఉగ్రరూపంలో గన్నులు పట్టుకొని నడిచివస్తున్న పోస్టర్ అదిరిపోయింది. యాక్షన్ ఎపిసోడ్ నుంచి కట్ చేసి డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

Advertisement

దసరా పండుగ అక్టోబర్ 24న ఉండటంతో అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల చేస్తున్నారు. అంటే లాంగ్ వీకెండ్ ని టార్గెట్  చేస్తున్నారు. దాదాపు 6 రోజుల పాటు లాంగ్ గ్యాప్ కలిసి వచ్చే అవకాశముంది. అనిల్ రావిపూడి తెలంగాణ యాసలో బాలయ్యతో పర్ఫెక్ట్ గా మాట్లాడిస్తే.. చాలు మరో రూ.100 కోట్లు సినిమా పడినట్టే.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటిని మరింత పెంచుతూ మేకర్స్ ఒక సాలిడ్ ట్రైలర్ ని కట్ చేసి వదిలితే ఎక్స్ టెషన్ పీక్స్ కి చేరిపోవడం గ్యారెంటీ. బాలయ్య అనగానేే సాలిడ్ మ్యూజిక్ ఇస్తున్న థమన్ మరోసారి భగవంత్ కేసరి కోసం రంగంలోకి దిగాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా భగవంత్ కేసరి నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టి పంపడం పక్కా అని తెలుస్తోంది. అక్టోబర్ 19న బాలయ్య భగవంత్ కేసరి బాక్సాఫీస్ పై ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

గుంటూరు కారం మూవీలో మరో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతుంది..?

మయోసైటిస్ వ్యాధి కారణంగా సమంతకు 12 కోట్ల నష్టం !

ఫ్యూచర్లో టాలీవుడ్ ని శాసించబోయే స్టార్ కిడ్స్ వీళ్లే..! లిస్టులో ఎవరెవరు ఉన్నారు అంటే..?

Visitors Are Also Reading