Home » Brahmastra Movie: బాయ్‌కాట్ బ్ర‌హ్మాస్త్ర పేరిట సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌.. ఎందుకంటే..?

Brahmastra Movie: బాయ్‌కాట్ బ్ర‌హ్మాస్త్ర పేరిట సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌.. ఎందుకంటే..?

by Anji
Ad

బాలీవుడ్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం బ్ర‌హ్మాస్త్ర. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించిన ఈ చిత్రానికి తెలుగులో బ్ర‌హ్మాస్త్రం పేరుతో రిలీజ్‌ చేయ‌బోతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, హీరోయిన్ అలియాభ‌ట్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున, మౌనిరాయ్ ల‌తో వీరితో పాటు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అతిథి పాత్ర‌లో మెరువ‌నున్నట్టు స‌మాచారం.

Advertisement

ఇక ఈ సినిమా నుంచి ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌లైన విష‌యం విధిత‌మే. విడుద‌లైన కొద్ది స‌మ‌యంలోనే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అదేవిధంగా ఈ సినిమా మంచి స్పంద‌న‌తో పాటు.. విమ‌ర్శ‌ల‌ను కూడా ఎదుర్కుంటోంది. ముఖ్యంగా #BycottBrahmastra’ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఆ సినిమా ట్రైల‌ర్‌లో చూపించిన ఓ స‌న్నివేశ‌మేన‌ట‌.

Advertisement

ఈ చిత్ర ట్రైల‌ర్‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్ గుడిలోకి వెళ్తూ గంట‌లు కొడ‌తాడు. కానీ అదే స‌మ‌యంలో హీరో ర‌ణ‌బీర్ షూ ధరించి ఉండ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ స‌న్నివేశం విమ‌ర్శ‌ల‌కు కార‌ణంగా మారింది. ఇది గ‌మ‌నించిన నెటిజ‌న్లు ర‌ణ‌బీర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల కొత్త‌గా పెళ్లి చేసుకున్న న‌య‌న‌తార‌, విఘ్నేష్ దంప‌తులు కూడా తిరుమ‌ల‌లో చెప్పులు వేసుకుని తిరిగిన విష‌యం విధిత‌మే. తాజాగా బ్ర‌హ్మాస్త్ర మూవీ హీరో ర‌ణ‌బీర్ ఇలా చేయ‌డంతో #BycottBrahmastra ట్యాగ్‌తో బాలీవుడ్‌ను ఏకి పారేస్తున్నారు. కొంద‌రైతే ఏకంగా వారెవ్వా బాలీవుడ్ షూల‌తో గుడిలోకి వెళ్లింది. మ‌రికొంద‌రూ ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయండి.. ఎందుకు షూల‌తో దేవాల‌యంలోకి వెళ్లాడు అని త‌దిత‌ర ట్వీట్ల‌తో బ్ర‌హ్మ‌స్త్ర సినిమాకు నిర‌స‌న సెగ త‌గిలింది. ఇక ఈ నిర‌స‌న సెగ‌పై చిత్ర యూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మ‌రీ.

Also Read : 

స‌మంత‌, చైత‌న్య‌లాగే ఆ స్టార్ కపుల్ కూడా విడిపోనున్నారు ..! వేణుస్వామి కామెంట్స్ హాట్ టాపిక్..!

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాయిధరమ్ తేజ్ ..! అసలేమయ్యిందంటే…?

Visitors Are Also Reading