Home » స‌మంత‌, చైత‌న్య‌లాగే ఆ స్టార్ కపుల్ కూడా విడిపోనున్నారు ..! వేణుస్వామి కామెంట్స్ హాట్ టాపిక్..!

స‌మంత‌, చైత‌న్య‌లాగే ఆ స్టార్ కపుల్ కూడా విడిపోనున్నారు ..! వేణుస్వామి కామెంట్స్ హాట్ టాపిక్..!

by AJAY
Ad

చాలా మంది జాత‌కాలు చెబుతుంటారు కానీ కొద్దిమందికి మాత్రమే క్రేజ్ వ‌స్తుంది. తెలుగు రాష్ట్రాల‌లో మంచి డిమాండ్ ఉన్న జోతిష్యుడు ఎవ‌రా అంటే ముందుగా వినిపించే పేరు వేణుస్వామి. ఈయ‌న సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు జాత‌కాలు చెప్పి తెగ‌పాపులారిటీ సంపాదించుకున్నాడు. వేణు స్వామికి పాపులారిటీ పెర‌గ‌టానికి కార‌ణం ఆయ‌న జోతిష్యం చెప్పిన కొన్ని విష‌యాలు జ‌ర‌గ‌ట‌మే.

Advertisement

ఏ హీరో జాతకం ఎప్పుడు బాగుంటుంది…? ఎప్పుడు ఫ్లాపులు పడతాయి ఎప్పుడు హిట్లు ప‌డ‌తాయి…? సెల‌బ్రెటీ జంట‌లు పెళ్లి త‌ర‌వాత విడిపోతారా క‌లిసి ఉంటారా ఇలాంటివే వేణు స్వామి చెబుతుంటారు. అప్ప‌ట్లో స‌మంత నాగ‌చైత‌న్య విడిపోతార‌ని వేణు స్వామి ముందే జోతిష్యం చెప్పాడు.ఇక ఆయ‌న చెప్పిన‌ట్టుగానే స‌మంత నాగ‌చైత‌న్య‌లు విడాకులు తీసుకున్నారు. దాంతో వేణుస్వామి జోతిష్యానికి క్రేజ్ పెరిగిపోయింది. అంతే కాకుండా జాతకం బాగోలేకుండా త‌న‌తో పూజ‌లు చేయించుకుంటే అంతా సెట్ అయిపోతుంద‌ని వేణుస్వామి చెబుతుంటాడు.

Advertisement

హీరోయిన్ ర‌ష్మిక ఇంట్లో వేణు స్వామి పూజ‌లు జ‌రిపించాడు. ఆ పూజ‌ల త‌ర‌వాత హీరోయిన్ స్టార్ మారిపోయింది అని చెబుతుంటారు. అయితే ఇప్పుడు వేణుస్వామి మ‌రో జంట విడిపోతుంద‌ని జోస్యం పలికాడు. ఇటీవ‌ల ప్ర‌ముఖ హీరో ఆదిపినిశెట్టి హీరోయిన్ నిక్కి గ‌ల్రానీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ స‌మయంలో ప్రేమ‌లోప‌డ్డ వీరిద్ద‌రూ పెద్ద‌ల‌ను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

హీరోయిన్ సంజ‌న గ‌ల్రానీ సోద‌రినే నిక్కీ గ‌ల్రానీ..ఇక నిక్కి ఆది క‌లిసి మ‌ర‌క‌త‌మ‌ని అనే సినిమాలో న‌టించ‌గా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా స‌మ‌యంలో ప్రేమ‌లోప‌డ్డ‌వీరిద్ద‌రూ చాలా కాలం డేటింగ్ చేశారు. రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. మ‌రి వేణు స్వామి చెప్పిన‌ట్టు ఈ జంట విడిపోతుందా..? అస‌లు వేణుస్వామి జాత‌కం అంత ప‌వ‌ర్ ఫుల్ ఆ అన్న‌ది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading