Home » వణుకుతున్న ఉత్తర కొరియా.. మరో అంటువ్యాధి పంజా విసురుతోంది..?

వణుకుతున్న ఉత్తర కొరియా.. మరో అంటువ్యాధి పంజా విసురుతోంది..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కరోనా,కరోనా, కరోనా దీనిపేరు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ కరోనా దాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. ఎంతోమంది చిన్నాచితకా వ్యాపారులు పూర్తిగా ఏ పనులు లేక అల్లాడిపోయారు. కరోనా దాటికి ఇప్పటికి కూడా కోలుకో లేకపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అలా పంజా విసిరిన కరోనా గత ఆరు నెలల నుంచి తగ్గు ముఖం పట్టింది. కానీ ఈ మధ్య కాలంలోనే కొత్తకొత్త అంటువ్యాధులు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఒకటి మంకీ ఫాక్స్, మరో అంటువ్యాధి ఉత్తర కొరియా లో పంజా విసురుతోంది..

Advertisement

దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..? అయితే ప్రపంచ దేశాలను కరోనా చుట్టుముట్టిన సమయంలో ఉత్తరకొరియా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేసులు తగ్గుతున్న వేళ, ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దీని దాటికి అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్క రోజే జ్వరం ఇతర లక్షణాలతో దాదాపుగా ఇరవై ఆరు వేల మంది ఆసుపత్రి పాలయ్యారు.

Advertisement

దీంతో అక్కడ కేసుల సంఖ్య 40,55,000 చేరింది. దీనికి తోడుగా ఉత్తర కొరియా లో మరో అంటువ్యాది కలకలం సృష్టిస్తోంది. ఓడరేవు నగరం అయినా హేజులో అంతుచిక్కని ఈ అంటువ్యాధి బారిన పడి చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి పేగులకు సంబంధించి ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. అయితే ఈ అంటు వ్యాధి బారిన ఇప్పటికి ఎంత మంది పడ్డారు అనేది అధికారికంగా మాత్రం బయటకు వెల్లడించలేదు అక్కడి ప్రభుత్వం.

also read;

ఉదయకిరణ్ తో తీయాలనుకున్న ‘సై’ సినిమాలో రాజమౌళి ఎందుకు హీరోను మార్చాడు..?

 చెల్లి పెళ్లికి అన్న.. చనిపోయిన తండ్రిని తీసుకొచ్చాడు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు పెడతారు..?

 

Visitors Are Also Reading