Home » ఉదయకిరణ్ తో తీయాలనుకున్న ‘సై’ సినిమాలో రాజమౌళి ఎందుకు హీరోను మార్చాడు..?

ఉదయకిరణ్ తో తీయాలనుకున్న ‘సై’ సినిమాలో రాజమౌళి ఎందుకు హీరోను మార్చాడు..?

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఉన్నారు. బాహుబలి సినిమా తో రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు రాజమౌళి తో సినిమాలు చేయాలని వెయిట్ చేస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ మన వాళ్ళనే పాన్ ఇండియా స్టార్ లుగా మలుస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే గతంలో కొంతమంది హీరోలు రాజమౌళి దర్శకత్వంలో ఆఫర్లు వచ్చినా మిస్ చేసుకున్నారు. అలాంటి హీరోల్లో ఉదయ్ కిరణ్ కూడా ఉన్నాడు. రాజమౌళికి పెద్దగా క్రేజ్ లేని సమయంలో నితిన్ హీరోగా సై సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది.

Advertisement

అయితే ఈ సినిమా కథ ముందుగా ఉదయ్ కిరణ్ కి వెళ్ళింది. కానీ అప్పటికే ఉదయ్ కిరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న ఉదయ్ కిరణ్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో రాజమౌళి ఆఫర్ ను తిరస్కరించాడు. దాంతో రాజమౌళి ఈ సినిమా కథను నితిన్ కి వినిపించారు. నితిన్ ఓకే చెప్పడంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్న తర్వాత ఉదయ్ కిరణ్ చాలా బాధపడ్డారని కూడా తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం. ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరో వద్దకు వెళ్లడం…ఆ హీరో సూపర్ హిట్ అందుకుని సక్సెస్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది.

Visitors Are Also Reading