తెలంగాణ పీసీసీ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలంటూ గాంధీ భవన్లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఉద్యోగం పోయే వరకు కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయించే బాధ్యత నాదని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్లోకి అధికారంలోకి తెచ్చే బాధ్యత నాది అని మీరు12 నెలల సమయం ఇవ్వండి అని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ప్రగతి భవన్ గోడలు బద్ధలు కొడతానని గొల్కొండ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్త అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ పేరు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తానని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతాడని ఆయన పేర్కొన్నారు. రాజీనామా చేయమని ఓ సన్నసి చెబుతున్నారని, కేసీఆర్కు దమ్ముంటే ఇప్పుడే ప్రనుభ్వం నీ రద్దుచేయమని చెప్పు.. కొట్లాడుదామంటూ.. ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ చేత కాక పీకేని తెచ్చుకున్నాడని ఆయన పేర్కొన్నారు.
Also Read :