Telugu News » మా అధ్య‌క్షుడు మంచు విష్ణు ఆఫీసులో భారీ చోరీ…ఆ వ్య‌క్తి పైనే అనుమానాలు..!

మా అధ్య‌క్షుడు మంచు విష్ణు ఆఫీసులో భారీ చోరీ…ఆ వ్య‌క్తి పైనే అనుమానాలు..!

by AJAY MADDIBOINA

మా అధ్య‌క్షుడు మంచు విష్ణుకు బిగ్ షాక్ త‌గిలింది. మంచు విష్ణు ఆఫీసులో భారీ చోరీ జ‌రిగింది. ఫిల్మ్ న‌గ‌ర్ లోని మంచు విష్ణు ఆఫీసులో రూ.5ల‌క్ష‌ల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రీ చోరీకి గుర‌య్యింది. అయితే సామాగ్రిని హెయిర్ డ్రెస‌ర్ నాగ శ్రీను తీసుకెళ్లిన‌ట్టుగా అనుమానిస్తున్నారు. అంతే కాకుండా ఈ ఘ‌ట‌న పై మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ జూబ్లిహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మేనేజ‌ర్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Ads

ఇదిలా ఉండ‌గా మంచు విష్ణు చివ‌రగా మోస‌గాళ్లు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. అంతే కాకుండా మోహన్ బాబు తాజా చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా సినిమాకు మంచు విష్ణు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా కూడా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. మ‌రోవైపు మోహ‌న్ బాబు సినిమాపై ట్రోల్స్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని కావాలనే కొంత‌మంది ట్రోల్ చేస్తున్నార‌ని మోహ‌న్ బాబు ఆరోపించారు. ట్రోల్స్ చేసేవారికి రూ.10 కోట్ల ప‌రువున‌ష్టం దావా వేస్తామ‌ని కూడా ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.


You may also like