Home » ‘రంగమార్తాండ’ సినిమాను పట్టించుకోని టాలీవుడ్ స్టార్లు?

‘రంగమార్తాండ’ సినిమాను పట్టించుకోని టాలీవుడ్ స్టార్లు?

by Bunty
Ad

కృష్ణవంశీ ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘రంగమార్తాండ’ ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మధ్య మరాఠీలో వచ్చిన నట సామ్రాట్ సినిమాకి ఇది రీమేక్. రంగమార్తాండ గా బిరుదును అందుకున్న ఓ రంగస్థల నటుడు, నిజజీవితంలో తన ముందు నటించేవారి కారణంగా ఇబ్బందులు పడటమే ఈ కథ. కాగా సినిమాలో అందరూ యాక్టర్స్ అద్భుతంగా నటించడంతో సినిమాను పండగ సెలవులో థియేటర్స్ లో చూడటానికి జనాలు ఉన్నంతలో బాగానే వచ్చారు అని చెప్పాలి ఇప్పుడు.

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Advertisement

Advertisement

బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో వ్యాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల దాకా ఉండగా వరల్డ్ వైడ్ గా 2.3 కోట్ల దాకా బిజినెస్ ను అందుకోగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 2.6 కోట్ల లోపు కలెక్షన్స్ ని సాధిస్తే సరిపోతుంది. అయితే, కృష్ణవంశీ రంగమార్తాండ గురించి టాప్ స్టార్స్ ఎవరూ మాట్లాడకపోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. సినిమా చూసి విష్ చెయ్యకపోయినా కనీసం ఆ సినిమాకి వచ్చే రెస్పాన్స్ చూసి కంగ్రాట్స్ చెప్పాల్సిందేమో, ఆయనేమీ చిన్న దర్శకుడు కాదు అనేది నెటిజన్స్ అభిప్రాయం.

READ ALSO : పవిత్ర-నరేష్ హనీమూన్… వెలుగులోకి షాకింగ్ నిజాలు…!

ఇక నిన్న థియేటర్స్ లో విడుదలైన చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి సినిమాని టాప్ స్టార్స్ కూడా సోషల్ మీడియా ద్వారా కాస్త ట్విట్స్ చేసి సపోర్ట్ చేస్తే సినిమాకి మరింత హెల్ప్ అవుతుంది. ఓ మంచి సినిమాలు బ్రతికించినట్టు అవుతుంది. మరి ఈ విషయంలో కృష్ణవంశీతో పని చేసిన ఏ స్టార్ హీరో అయినా కాస్త ముందడుగు వేస్తారేమో చూడాలి.

READ ALSO : AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

Visitors Are Also Reading