Home » మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపుతూ వ‌చ్చిన 5 తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే..!

మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపుతూ వ‌చ్చిన 5 తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే..!

by AJAY
Ad

సినిమా అంటే కేవ‌లం వినోదం మాత్రమే కాదు..సినిమా అంటే కేవ‌లం ఫైట్స్ మాత్ర‌మే కాదు..సినిమాలో బ‌య‌ట చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను చెప్ప‌వ‌చ్చు. అంతే కాకుండా మంచి విష‌యాలు చెప్పి ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌వ‌చ్చు. సినిమాలో మెసేజ్ లు ఉంటే వాటిని అంద‌రూ స్వీక‌రించ‌క‌పోయినా కొంత‌మందిలో అయినా మ‌ర్పు క‌ల‌గ‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మాజంలో మార్పు తీసుకువ‌చ్చేలా మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై టాలీవుడ్ లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు వ‌చ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి:   కోహ్లీ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన అతని మేనేజర్..!

Advertisement

శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు అంటే ఫీల్ గుడ్ సినిమాలు అని చెబుతుంటారు. అయితే శేఖ‌ర్ క‌మ్ముల త‌న సినిమాల్లో వినోదం పంచ‌డంతో పాటూ మెసేజ్ లు కూడా ఇస్తుంటాడు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ హీరోగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా వ‌చ్చిన సినిమా ఫిదా..

fidaa

fidaa

ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి సోద‌రి వివాహం త‌ర‌వాత ఫారెన్ వెళ్లిపోతుంది. కానీ సాయి ప‌ల్ల‌వి మాత్రం నేను అక్క‌లా నిన్ను ఇడిసి పోన‌య్యా అంటూ త‌న తండ్రితో చెబుతూ ఉంటుంది. అలా పెళ్లి త‌ర‌వాత ఆడ‌పిల్ల ప‌డే వేద‌న‌న‌ను ద‌ర్శ‌కుడు చూపించాడు. ఆడ‌పిల్ల‌ మాత్రమే ఇల్లు విడిచిపోవాలా అన్న‌ట్టుగా శేఖ‌ర్ క‌మ్ముల చెప్ప‌క‌నే చెప్పాడు.

క‌ల‌ర్ ఫోటో సినిమాలో అబ్బాయిలు ల‌వ్ ఫెయిల్యుర్ అయితే మందు కొట్టి ఫ్రెండ్స్ కు చెప్పుకుని మ‌ర్చిపోతార‌ని కానీ అమ్మాయిలు మాత్రం పెళ్లి పీట‌ల మీద ఉంటార‌ని సినిమాలో హీరోయిన్ వ‌దిన హీరోయిన్ తో చెబుతూ బాధ‌ప‌డుతుంది. అలా ల‌వ్ ఫెయిల్ అయిన త‌ర‌వాత అమ్మాయిలు ప‌డే ఇబ్బంది గురించి సినిమాలో చెప్పారు.

Advertisement

Ritu Varma

Ritu Varma

పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్ తండ్రి త‌న‌దో పాపం చేస్తే అమ్మాయిపుట్టింద‌ని బాధ‌ప‌డుతూ ఉంటాడు. కానీ హీరో వ‌చ్చి ఓ సంధ‌ర్బంలో నా లాంటి ఓ కొడుకు ఉంటే మీకు తెలిసేది. ఇంట్లో బంగారాన్ని పెట్టుకుని కొడుకు ఉంటే బాగుంటుంద‌ని అనుకోవ‌డం ఏంటి అని క్లాప్ తీసుకుంటాడు. ఇక్క‌డ కూడా అమ్మాయిల‌కు జీవితంలో న‌చ్చింది చేసే అవ‌కాశం ఇవ్వండి అని ద‌ర్శ‌కుడు మెసేజ్ ఇచ్చాడు.

 

డియ‌ర్ కామ్రెడ్ సినిమాలో ర‌ష్మిక క్రికెట‌ర్ అయితే త‌న‌ను త‌న కోచ్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో హీరో ఎంట‌ర్ అయ్యి వాడికి బుద్ది చెబుతాడు. తాను మంచి క్రికెట‌ర్ అయిన‌ప్ప‌టికీ హీరోయిన్ తండ్రి ఇబ్బందులు ఉంటే క్రికెట్ ను వ‌దిలేయాల‌ని చెబుతుంటాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య‌లో హీరోయిన్ త‌న ఆశ‌యాన్ని నెర‌వేర్చుకోవ‌డానికి న‌లిగిపోతూ ఉంటుంది.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌రో సూప‌ర్ హిట్ సినిమా ల‌వ్ స్టోరీలో కూడా మ‌హిళ‌లు ఎదుర్కునే స‌మ‌స్య‌ను ద‌ర్శ‌కుడు లేవ‌నెత్తాడు. సినిమాలో సొంత బాబాయి హీరోయిన్ ను లైంగికంగా వేధిస్తాడు. దాంతో చిన్న‌నాటి నుండి ఎంతో వేద‌న అనుభ‌విస్తుంది. అమ్మాయిల విష‌యంలో సొంత‌వారిని సైతం గుడ్డిగా న‌మ్మ‌వ‌ద్ద‌ని..వారికి త‌మ‌తో ఫ్రీగా ఉండే అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడు మంచి మెసేజ్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి: అఖిల్ కాకుండా చైతూకు మ‌రో త‌మ్ముడు ఉన్నాడ‌న్న సంగ‌తి తెలుసా..? అత‌డు ఏం చేస్తున్నాడంటే..?

 

Visitors Are Also Reading