వాహనదారులకు భారీ షాక్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందుస్థాన్ ప్రచురించింది. దీని ప్రకారం, టోల్ గేట్లు 5 నుంచి 10% పెరిగే అవకాశం ఉంది.
read also : Kabzaa Trailer : కబ్జా ట్రైలర్ రిలీజ్… కేజిఎఫ్ మూవీని మించిపోయిందిగా…!
Advertisement
జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం, సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ ఛార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ విషయమై విధాన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. టోల్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారం లోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉందని హిందుస్థాన్ నివేదిక పేర్కొంది.
Advertisement
Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి
కార్లు, తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్ ఛార్జీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారి పాసులు జారీ చేస్తుంటారు. ఆ పాస్ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
READ ALSO : Director Sagar Passed Away : టాలీవుడ్‌కు వరుస విషాదాలు.. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత..