Home » శీతాకాలం ఆహారంలో ఈ మార్పులు చేస్తే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!

శీతాకాలం ఆహారంలో ఈ మార్పులు చేస్తే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!

by Sravya

శీతాకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. శీతాకాలంలో ఆరోగ్యం బాగుండాలంటే ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటే మంచిది. షుగర్ కంట్రోల్ అవుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగడం వలన కణజాలాలకి తీవ్ర నష్టం కలుగుతుంది. దీనిని నివారించడానికి ప్రోటీన్ కావాలి. గుడ్లు, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. పండ్ల లో పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, ఖనిజలు, లవణాలు శరీరంలో కణజాలాల క్షీణతని నివారించడానికి సహాయం చేస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్ ని డైట్ లో చేర్చుకోండి. విటమిన్ సి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్లో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బీట్రూట్, బచ్చలి కూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీలు, గ్రీన్ పీస్, మొక్కజొన్న వంటి కూరగాయలు తీసుకుంటూ ఉండండి. చలికాలంలో వెచ్చగా ఉండడానికి టీ కాఫీలు ఎక్కువ తీసుకుంటుంటారు చాలామంది వీటికి దూరంగా ఉండాలి. వీటి కారణంగా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. బియ్యం, బంగాళదుంపల్ని తక్కువ తీసుకోవడం మంచిది అలానే బెల్లం కూడా బాగా తగ్గించండి.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading