Home » ఈ 5 లక్షణాలుండే అబ్బాయిలను అమ్మాయిలుగా బాగా ఇష్టపడతారట..3వది చాలా ముఖ్యం

ఈ 5 లక్షణాలుండే అబ్బాయిలను అమ్మాయిలుగా బాగా ఇష్టపడతారట..3వది చాలా ముఖ్యం

by Bunty
Published: Last Updated on

ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కచ్చితంగా నమ్మింది అంటే తను చచ్చే వరకు అతని మర్చిపోదు. అతనితో జీవితం పంచుకోవాలని తప్పనిసరిగా అనుకుంటుంది. అలా అమ్మాయి, అబ్బాయిని అంతలా ఇష్టపడడానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అబ్బాయిల్లో ఉండాలట. ఈ లక్షణాలు ఉంటే అమ్మాయి తప్పనిసరిగా మిమ్మల్ని ఇష్టపడుతుందని అంటున్నారు. మరి ఆ లక్షణాలు మీలో ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి.

Also Read:  బైక్ పై పాడు పనులు…..ఆ జంటకు షాక్ ఇచ్చిన లక్నో పోలీసులు….!

# ధైర్యం

అవును మీరు చదివింది కరెక్టే. అమ్మాయిలు ఇష్టపడాలంటే ముందు మీరు ధైర్యవంతులై ఉండాలి. ఏ సందర్భం అయినా, ఏ కష్టమైనా, ఎలాంటి పరిస్థితిని అయినా మీరు ఎదుర్కోనగలరని నమ్మకం వారికి కలగాలి. మీరు ఒక ధైర్యవంతుడని, మీతో ఉంటే వారికి ఎలాంటి భయం ఉండదనే నమ్మకాన్ని మీరు కలిగించగలగాలి.

# సమయస్ఫూర్తి

సమయస్ఫూర్తి దీనినే మనం ఇప్పుడు స్పాంటేనిటి అని కూడా అంటుంటాం. ఏ అమ్మాయికైనా అబ్బాయి ఎప్పుడూ కోపంగా, ఏదో గిరి గిసుకుని ఉంటే నచ్చదు. అబ్బాయి అనే వాడు కాస్త జోవియల్ గా ఉండాలి. అప్పుడప్పుడు పంచులు వేస్తూ వారిని నవ్వించాలి. ఇతనితో నాకు అస్సలు టైం తెలియదు అని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలి.

# నిజాయితీ

ఏ లక్షణం ఉన్నా లేకపోయినా ఈ లక్షణం మాత్రం తప్పకుండా ఉండాలి. ఒక్క అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసమే కాదు, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అన్నా కూడా మీలో నిజాయితీ ఉండాలి. ఎవరితోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలగాలి. తప్పుని తప్పని, ఒప్పుని ఒప్పని చెప్పగలగాలి. మీరు తప్పు చేసిన కూడా దానిని నిజాయితీగా, నిర్భయంగా ఒప్పుకోవాలి.

# తెలివితేటలు

అబ్బాయి ధైర్యవంతుడై ఉండాలి. సమయస్ఫూర్తి ఉండాలి అని ఎలా కోరుకుంటారో అలాగే తెలివైనవాడు కావాలని కోరుకుంటారు. తాము ఇష్టపడే అబ్బాయి మరి దద్దిగా ఉంటే వాళ్లకు నచ్చదు. కాస్త తెలివైనవాడు అయి ఉండాలని కోరుకుంటారు. పరిస్థితులను చక్కదిద్దగల వ్యక్తి అవ్వాలని ఆశపడుతుంటారు.

Also Read:  తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్..రూ. 2,50,000 జీతం!

# గౌరవం

అమ్మాయిలు, స్త్రీలు, అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, మీ ఫ్రెండ్, కొలీగ్ ఇలా ఎవరికైనా మీరు గౌరవం ఇవ్వాలి. స్త్రీలు, అమ్మాయిలు వారికంటూ సముచిత స్థానాన్ని, ఒక గౌరవాన్ని కోరుకుంటారు. ప్రతి విషయంలో వారికి అవకాశం కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, వారికి కూడా మాట్లాడే అవకాశం కల్పించడం అనేది చాలా ముఖ్యం.

READ ALSO : అయ్యో పాపం..మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి !

Visitors Are Also Reading