Home » తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్..రూ. 2,50,000 జీతం!

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్..రూ. 2,50,000 జీతం!

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలోనే, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది సర్కార్‌. ఈ నేపథ్యంలోనే మరో తీపికబురు చెప్పింది. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. ముఖ్యంగా ఐటి మినిస్టర్ కేటీఆర్ సూపర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు.

Advertisement

ప్రభుత్వ కళాశాలలో చదువుకునే స్టూడెంట్స్ ఇంటర్ కంప్లీట్ చేయగానే సాఫ్ట్వేర్ జాబ్స్ తలుపు తట్టనున్నాయి. తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి హెచ్ సి ఎల్ కంపెనీ తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఈ జాబ్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఇంటర్ లో ఒక సబ్జెక్టు మ్యాథ్స్ తీసుకోవాలి. కాగా సంవత్సరానికి ఇలా 20,000 మందిని హైర్ చేయనుంది HCL. గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న స్టూడెంట్స్ ఏటా ఫిబ్రవరిలో హెచ్ సి ఎల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. ఈ పరీక్షలో మ్యాథ్స్ తో పాటు ఆంగ్లం, లాజికల్ రీజనింగ్ ఉంటాయి. ఇందులో 60% మార్క్స్ తెచ్చుకున్న వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

Advertisement

ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలోనే ఉంటుంది. ఇందులో మంచి టాలెంట్ చూపిస్తే జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఆన్లైన్ లోనే ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అది కంప్లీట్ అయ్యాక హెచ్ సి ఎల్ ఆఫీస్ లో మరో ఆరు నెలలు ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్ షిప్ ఉన్నప్పుడు 10,000 స్టైఫండ్ ఇస్తారు. ఇది కూడా కంప్లీట్ అయ్యాక జాబ్ లో జాయిన్ అవ్వాలి. ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి రూ. 2,50,000 వార్షిక వేతనం ఇస్తారు. అంటే నెలకు 20,000 చేతికి వస్తుంది. ఇంకో సౌలభ్యం ఏంటంటే జాబ్ చేస్తూనే బిట్స్, ఎమిటి వంటి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయవచ్చు. ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ పెరుగుతుంది.

READ ALSO : అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

Visitors Are Also Reading