Home » ఆదిత్య 369 నుండి “బింబిసార‌” వరకు వచ్చిన టైం ట్రావెల్స్ సినిమాలు…వాటి రిజ‌ల్ట్స్ ఇవే…!

ఆదిత్య 369 నుండి “బింబిసార‌” వరకు వచ్చిన టైం ట్రావెల్స్ సినిమాలు…వాటి రిజ‌ల్ట్స్ ఇవే…!

by AJAY
Ad

సోషియో ఫాంటసీ చిత్రాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే టైం ట్రావెల్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇలాంటి సినిమాలు రావడం ఇప్పుడే మొదలవలేదు.

Advertisement

ఇవి కూడా చదవండి:  రెండవ వివాహం చేసుకున్నవారికి జీవితంలో ఎదురయ్యే 5 సమస్యలు ఇవేనా ?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమా నుండి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. తాజాగా క‌ల్యాణ్ రామ్ హీరోగా బింబిసార వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమా అంటే అంత ఈజీ కాదు. పక్కా స్క్రిప్ట్ ఉండటం తో పాటు స్క్రీన్ ప్లే ను మ్యానేజ్ చేయగలగాలి. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 1991లో ఆదిత్య 369 సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవో చూపించారు.

Balakrishna's famous sci-fi 'Aditya 369' turns 27 today | Telugu Movie News - Times of India

ఇవి కూడా చదవండి: మ‌హేశ్ బాబు యువ‌రాజు సినిమాలో న‌టించిన ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్…ఎవ‌రో గుర్తుపట్టారా..?

Advertisement

Love Story 2050 (2008) - IMDb

బాలీవుడ్ హీరో అర్మాన్ ఖాన్ ప్రియాంక చోప్రా జంటగా నటించిన లవ్ స్టోరీ 2050 సినిమా కూడా టైం ట్రావెల్ కథాంశం తో తెరకెక్కింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

5 years of 24 : 10 interesting facts about Suriya's time travel movie

హీరో సూర్య, సమంత జోడిగా నటించిన 24 సినిమా కూడా టైమ్ ట్రావెల్ కథాంశంతో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. సినిమాలో సూర్య త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ అవ్వలేకపోయింది.

ఇవి కూడా చదవండి: మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపుతూ వ‌చ్చిన 5 తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే..!

Tentative Release date of Project K

ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెర‌కెక్క‌బోతున్న‌ భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్టు కే కూడా టైం ట్రావెల్ కథాంశంతో రాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Visitors Are Also Reading