Home » మ‌హేశ్ బాబు యువ‌రాజు సినిమాలో న‌టించిన ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్…ఎవ‌రో గుర్తుపట్టారా..?

మ‌హేశ్ బాబు యువ‌రాజు సినిమాలో న‌టించిన ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్…ఎవ‌రో గుర్తుపట్టారా..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా న‌టించిన‌వారు ఇప్పుడు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయారు. అమ్మాయిలు చూడ్డానికి హీరోయిన్స్ లా మారిపోతే అబ్బాయిలు హీరోల మాదిరిగా క‌నిపిస్తున్నారు. అంతే కాకుండా ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లు గా మెప్పించిన‌వారు కొంత మంది హీరోహీరోయిన్ లుగా న‌టిస్తూ మెప్పిస్తున్నారు కూడా. హీరో త‌రుణ్ కూడా చిన్న వ‌య‌సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించాడు. ఆ త‌ర‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా వ‌చ్చిన హీరో తేజ స‌జ్జ ఎన్నో చిత్రాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి:  ఆ ఒక్క కారణం తో “లైగర్” సినిమాలో రమ్యకృష్ణ పాత్రను మిస్ చేసుకున్న బ్యాడ్ లక్ నటి ఎవరో తెలుసా..?

Advertisement

 

ఇప్పుడు హీరోగా కూడా సక్సెస్ ట్రాక్ పై ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా మ‌హేశ్ బాబు ప‌క్క‌న ఒక‌ప్పుడు న‌టించిన చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లా మారిపోయింది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన యువ‌రాజు సినిమాలో శ్రీదివ్య అనే చిన్నారి న‌టించింది. అంతే కాకుండా ర‌వితేజ హీరోగా న‌టించిన వీడే సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించి మెప్పించింది.

Advertisement

అదే విధంగా జ‌గ‌ప‌తిబాబు అర్జున్ లు హీరోలుగా నటించిన హ‌నుమాన్ జంక్ష‌న్ సినిమాలో కూడా న‌టించి అల‌రించింది. అక్క‌డ క‌ట్ చేస్తే 2010లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌న‌సార సినిమాతో శ్రీదివ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అద‌ర‌కొట్టింది. చూడ్డానికి ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించిన శ్రీదివ్య అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా త‌ర‌వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ‌స్టాప్ సినిమాలో కూడా హీరోయిన్ గా న‌టించి క్రేజ్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి: చిరంజీవి గురించి శోభన్ బాబు ఇలా చెబుతూ ఎందుకు బాధపడ్డారు ? ఇక నన్ను ఎవ్వరు చూడరు.. అంటూ..!

ఆ త‌ర‌వాత కేరింత సినిమాలో కూడా హీరోయిన్ గా న‌టించింది. కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళ చిత్రాల‌లోనూ న‌టించింది. తెలుగ‌మ్మాయే అయినా త‌మిళ్ లో మంచి అవ‌కాశాల‌ను అందుకుంది. ఇక చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదివ్య రీసెంట్ గా జ‌న‌గ‌ణ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. అయితే మ‌హేశ్ బాబు శ్రీవిద్య‌ను ఎత్తుకున్న ఫోటో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో ఇప్పుడు అంతా ఆ చిన్నారి శ్రీదివ్య‌నా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇవి కూడా చదవండి:  సింహాద్రి నుండి ఆర్ఆర్ఆర్ వ‌ర‌కూ జ‌క్క‌న్న ప‌రిచ‌యం చేసిన ఆయుదాలు ఇవే..!

 

Visitors Are Also Reading