Home » అక్క‌డ టైట్ జీన్స్‌, జుట్టుకు రంగులు వేస్తే ఇక అంతే..!

అక్క‌డ టైట్ జీన్స్‌, జుట్టుకు రంగులు వేస్తే ఇక అంతే..!

by Anji
Ad

పాశ్చాత్య సంస్కృతికి వ్య‌తిరేకంగా క‌ఠిన ఆంక్ష‌ల‌ను విధించింది. ఉత్త‌ర కొరియా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మ‌ధ్య గ‌ల మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తుంద‌ని మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. టైట్ జీన్స్‌, జుట్టుకు రంగులు, అస‌భ్య‌క‌ర‌మైన రాత‌లు గ‌ల బ‌ట్ట‌లు ధ‌రించ‌డం లాంటి వాటిని క‌ఠినంగా అణిచివేస్తుంది. ఇలాంటి వేషాధారణతో రోడ్ల‌పై క‌నిపిస్తే.. పెట్రోలింగ్ అధికారులు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లిస్తున్నారు. ఆ త‌రువాత నేరాన్ని ఒప్పుకుని.. అలాంటి దుస్తులు ఎప్పుడు ధ‌రించం అని హామీ ఇచ్చిన త‌రువాత‌నే వారిని విడుద‌ల చేస్తున్నారు.

గ‌త మే లోనే ఉత్త‌ర కొరియా జీన్స్‌, హెయిర్ స్టైల్స్‌ను నిషేధించింది. విదేశీ అలంక‌ర‌ణ‌ను ప్ర‌మాద‌క‌ర‌మైన విషంగా అభివ‌ర్ణించారు. ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్‌జోంగ్ ఉన్ ప్ర‌క‌ట‌న త‌రువాత ఆంక్ష‌ల అమ‌లుపై అధికారులు మ‌రింత శ్ర‌ద్ధ పెట్టారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే యూత్ లీగ్ వీటిని ప్ర‌చారం చేస్తుంది. దేశ‌వ్యాప్తంగా విద్యార్థుల‌కు స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తోంది. అత్యంత తీవ్ర‌మైన సంద‌ర్భాల్లో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి చిరునామా లౌడ్ స్పీక‌ర్ల‌లో ప్ర‌చారం చేయిస్తామ‌ని యూత్‌లీగ్ స‌భ్యులు వెల్ల‌డించారు.

Advertisement

Advertisement

ఎన్ని నిబంధ‌న‌లు విధించినా యువ‌త విదేశీ సినిమాలు, దుస్తులు ధ‌రించ‌డంలో మార్పు రావ‌డం లేద‌ని పేర్కొన్నారు. అణు నిరాయుధీక‌ర‌ణ ప్రారంభిస్తే సాయం చేస్తాం. మ‌రొక వైపు ఉత్తర కొరియా అణు నిరాయుధీక‌ర‌ణ చ‌ర్యలు ప్రారంభిస్తే.. ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి కృషి చేస్తాం అన్నారు. ద‌క్షిణ కొరియా నూత‌న అధ్య‌క్షుడు యున్ సుక్‌యోల్‌. మంగ‌ళ‌వారం నూత‌న అధ్య‌క్షునిగా బాధ్య‌తలు చేప‌ట్టిన త‌రువాత ఆయ‌న పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మాట్లాడారు. ఉత్త‌ర కొరియా స‌మ‌స్య‌ను చ‌ర్చ‌ల‌తో ప‌రిష్క‌రించుకోవ‌డానికి సిద్ధం అన్నారు. ఉత్త‌రకొరియా అణు నిరాయుధీక‌ర‌ణ చేస్తే.. ప్రోత్సాహ‌కాల‌ను అందిస్తాం అని ద‌క్షిణ కొరియా నాయ‌కులు గ‌తంలోను ప్ర‌క‌టించారు. అయితే కిమ్‌జోంగ్ ఉన్ ప్ర‌భుత్వం వాటిని తిర‌స్క‌రించింది.

Also Read : 

ఆర్ఆర్ఆర్ లో బ్లండర్ మిస్టేక్ చేసి దొరికిపోయిన జక్కన్న… ఆడేసుకుంటున్న నెటిజన్లు..!

 ఏపీ సీఎం జ‌గ‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేష్‌బాబు

Visitors Are Also Reading