Home » ఏపీ సీఎం జ‌గ‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేష్‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేష్‌బాబు

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా మ‌హేష్ బాబు కనిపిస్తున్నాడు. మ‌రొక రెండు రోజుల్లో మ‌హేష్ హీరోగా న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌ల అవుతుండ‌గా ప్ర‌మోష‌న్స్ ను మేక‌ర్స్‌ వేగ‌వంతం చేశారు.


ఇక దీంతో వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో మ‌హేష్ బిజీగా మారాడు. తాజాగా మ‌హేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌మ్మె జ‌గ‌న్ గురించి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేసారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేరుగా క‌లిసిన‌ప్పుడు స‌ర్‌ప్రైజింగ్ అనిపించింది. ఆయ‌న‌తో అప్పుడ‌ప్పుడు ఫోన్‌లో మాట్లాడాను. అంతేకానీ నేరుగా క‌లువ‌లేదు. మొద‌టిసారి ఆయ‌న‌ను క‌ల‌వ‌డం చాలా ఆనందం ఇచ్చింది అన్నారు. ఆయ‌న చాలా సింపుల్‌.. అంత సింపుల్‌గా ఉండ‌డం చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయాను అని చెప్పారు.

Advertisement

Advertisement

ఎదుటి వ్య‌క్తుల‌కు మంచి గౌర‌వం ఇస్తారు. ఆయ‌న‌తో చాలా విష‌యాల‌ను చ‌ర్చించాం. సినిమాల గురించి చాలా విష‌యాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి స‌మావేశం ఎప్పుడో జ‌రిగుంటే బాగుంటుంద‌ని నేను స‌ల‌హా ఇచ్చాను. అందుకు ఆయ‌న సాన‌కూలంగా స్పందించారు. ఆయ‌న మ‌మ్మ‌ల్ని రిసీవ్ చేసుకున్న విధానం నాకు బాగా న‌చ్చింది. ఆయ‌న‌తో గ‌డిపిన స‌మ‌యం గుర్తుండిపోతుందంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Also Read : 

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌.. బ‌ర్త్ డే రోజున స‌ర్‌ప్రైజ్‌..!

సీరియ‌ల్స్ లో క‌ట్టిన చీర‌లు..వేసుకున్న బంగారం ప‌డేస్తారా..?

 

Visitors Are Also Reading