ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో పలువురు యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. ఐదుగురు సీనియర్ ఆటగాళ్లకు మాత్రం ఇదే చివరి ఐపీఎల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇటీవల జరిగిన మిని వేలంలో దాదాపు అన్ని జట్లూ కూడా యువ ప్లేయర్స్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవో లాంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. వీరితో పాటు వచ్చే ఏడాది లీగ్ కు దూరం కానున్న ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : RC15 : రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదే..!
Advertisement
ఎం.ఎస్. ధోని :
ఐపీఎల్ 2023 మహేంద్ర సింగ్ ధోనికి చివరి సీజన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియా నుంచి రిటైర్ అయిన ధోని చెన్నైలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాలని భావిస్తున్నాడు. అదేవిధంగా ధోని రిటైర్ తరువాత సీఎస్ కే పగ్గాలు బెన్ స్టోక్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
దినేష్ కార్తిక్ :
Advertisement
దినేష్ కార్తిక్ కు ఇప్పుడు 38 ఏళ్లు. టీ 20 ప్రపంచ కప్ కు టీమిండియాలో చోటు దక్కినా ఫినిషర్ గా పెద్దగా రాణించలేకపోయారు. అదేవిధంగా అతనికి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు. ఎందుకు అంటే.. కామెంటేటర్ గా కార్తీక్ రాణిస్తున్నాడు.
డేవిడ్ వార్నర్ :
ఐపీఎల్ 2023 డేవిడ్ వార్నర్ కి చివరి ఐపీఎల్ అవుతుంది. ఈ మధ్య ఫామ్ లేమితో సతమతమవుతున్న వార్నర్ వన్డే వరల్డ్ కప్ తరువాత క్రికెట్ కి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమిత్ మిశ్రా :
అమిత్ మిశ్రా వయస్సు 41 ఏళ్లు. అతని వయస్సు దృష్ట్యా గత ఏడాది జరిగిన వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. ఈసారి లక్నో సొంతం చేసుకోగా.. వచ్చే సీజన్ లో కనిపించే అవకాశం లేదు. చివరి ఐపీఎల్ కావచ్చు.
అంబటి రాయుడు :
చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అంబటి రాయుడికి ఇదే చివరి ఐపీఎల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతడి వయస్సు 38 సంవత్సరాలు. రాయుడికి గాయాలు, ఫామ్ ఇబ్బంది పెడుతోంది. దీంతో ఈ ఐపీఎల్ చివరిది అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read : పవన్ కల్యాణ్ సినిమాలో మల్లారెడ్డికి బంపరాఫర్..కానీ ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?