Home » RC15 : రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదే..!

RC15 : రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదే..!

by Anji
Ad

సాధారణంగా తమిళ దర్శకుడు శంకర్ మూవీ అంటే భారీ తనానికి మారు పేరు అనే చెప్పాలి. భారీ సెట్స్, భారీ యాక్షన్ సీన్లు, భారీ తారాగణం ఇలా అంతా భారీగానే ప్లాన్ చేస్తుంటాడు దర్శకుడు శంకర్. RRR వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈసారి శంకర్ మరింత రెచ్చిపోతున్నాడు. RRR ను మించి ఇంట్రో సీన్ ఉండనుందట. దాదాపు 1000 మంది డ్యాన్సర్స్ తో శంకర్ చిత్రీకరిస్తున్న కొత్త సినిమా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.  

Also Read :  మహేష్ బాబు SSMB విడుదల ఎప్పుడో తెలుసా ?

Advertisement

దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. వాటన్నింటిని మించి చరణ్, కియారాలపై చిత్రీకరిస్తున్న పాట ఉండబోతుందట. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేశారు. గేమ్ చేంజర్ (Game Changer)  టైటిల్ రివీల్ చేయగా.. మధ్యాహ్నం 3.06 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.  

Advertisement

Also Read :  వయస్సు అయిపోయిన హీరోయిన్లు… ఆంటీ పాత్రలకే పరిమితమా? – అల్లు అర్జున్ హీరోయిన్

మరోవైపు గేమ్ చేంజర్ అనే టైటిల్ ఎలాగో గ్లోబల్ కి పనికి వస్తుందని, ఇంతకు ముందు అయితే సీఈవో, సర్కారోడు అనే టిటిల్స్ తో పాటు అధికారి అనే టైటిల్ అనుకున్నారట. కానీ ఎట్టకేలకు ఫైనల్ గా గేమ్ ఛేంజర్ ఫిక్స్ చేశారు. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి వెళ్లేందుకు అప్పీల్ రావాలనే ఉద్దేశంతో గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను దర్శకుడు శంకర్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగో కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.  ఇవాళ రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో పలువురు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Also Read :  చిరంజీవికి ముచ్చమటలు పట్టించిన ‘వెంకటేష్’ సినిమా! దెబ్బకి రికార్డ్స్ బద్దలు!

Visitors Are Also Reading