Home » IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి బాలయ్య.. ఇక దబిడిదిబిడే

IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి బాలయ్య.. ఇక దబిడిదిబిడే

by Bunty
Published: Last Updated on
Ad

టీమిండియా క్రికెట్ జట్టు అంతర్జాతీయ సీజన్ ప్రస్తుతం ముగిసింది. ఇప్పుడు అందరి చూపు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై పడింది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Advertisement

అయితే, ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపిఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ సమాయత్తమవుతుంది. ఇది ఇలా ఉండగా.. సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఆ తర్వాత టాక్ షోలో హోస్ట్ గా సత్తా చాటి ప్రేక్షకులతో ఓహో అనిపించారు. ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు కామెంటెటర్ గా అవతారం ఎత్తేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు.

Advertisement

ఐపిఎల్ కామెంటేటర్​గా బాలకృష్ణ.. ఇక ఫ్యాన్స్‎కు పండగే - Mana Telangana

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ రోజున బాలకృష్ణ కామెంటరీ ఉంటుందని చెప్పింది స్టార్ స్పోర్ట్స్. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇక ఈ అప్డేట్‌ తో బాలయ్య ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇటీవలే బాలయ్య.. వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

READ ALSO : IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!

Visitors Are Also Reading