Home » ఈసారి సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్..!

ఈసారి సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్..!

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన  గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత  దిల్ రాజు ముఖ్య అతిథిగా హజరై సంక్రాంతి కలెక్షన్లలో మహేష్ బాబు తాట తీస్తాడని చెప్పారు. ఇక ఈ ఈవెంట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి.  ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం.. మరొకటి రమణగాడు మీవాడు.. మనందరి వాడు.  అందుకే మీ మధ్య ఈ వేడుక చేయాలని అనుకున్నాం.

Advertisement

సాధారణంగా షూటింగ్ లో చాలా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నా సరే..  హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చారు. అందుకే మీరు కొంచెం క్రమశిక్షణగా మెలిగి పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. పోలీసువారు కంట్రోల్ చేయలేక.. అలసిపోతున్నారు. అందుకే ఈవెంట్ త్వరగా ముగించేద్దాం. సూపర్ స్టార్ కృష్ణగారు తెలుగు సినిమాల్లో ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప నటుడు. మహామనిషి అలాంటి ఆయనతో నేను నేరుగా పని చేయలేకపోయాను. కానీ ఆయన పని చేసిన సినిమాకు పోసాని కృష్ణ మురళి గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాను. మహేష్ బాబుతో అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసినప్పుడు ఆడనయతో మాట్లాడాను. ఆయనతో గడిపిన ప్రతిక్షణం చాలా చాలా అమూల్యమైనది. అపురూపమైనది.

Advertisement

అలాంటి గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ ఇంకెంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. తండ్రి చేయలేని కొన్ని రకాల సినిమాలను కూడా చేయడానికి రెడీగా ఉండే తండ్రికి తగ్గ తనయుడు మహేష్ అనిపిస్తుంది. ఒక సినిమాకు 100 శాతం కాదు.. 200 శాతం పనిచేసే నటుడు మహేష్ ఒక్కరే. ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో ఏ ఒక్కరు వెనక్కి తిరిగి చూలేరు. అతడు, ఖలేజా సినిమాలు చేసినప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు. పాతికేళ్లు అవుతుందని మీరంటున్నారు.. కానీ మాత్రం మూడేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యాడు అనిపిస్తుంది. చూడటానికి ఎంత యవ్వనంగా ఉన్నారో.. యాక్టింగ్ లోనూ అంతే యవ్వనంగా ఉన్నారు. ఈసారి సంక్రాంతిని రమణగాడితో కలిసి జరుపుకుందాం” అంటూ చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading