Home » భూమా మౌనిక‌తో రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మ‌నోజ్‌..!

భూమా మౌనిక‌తో రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మ‌నోజ్‌..!

by Anji

న‌టుడు మంచు మ‌నోజ్ గురించి దాదాపుగా అంద‌రికీ తెలిసే ఉంటుంది. మోహ‌న్‌బాబు రెండ‌వ కుమారుడు మ‌నోజ్ పేరు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా మ‌నోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడ‌నే వార్త హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తోంది. క‌ర్నూలు జిల్లాకి చెందిన దివంగ‌త‌ భూమా నాగిరెడ్డి, శోభ దంప‌తుల కుమార్తె మౌనికారెడ్డితో క‌లిసి మంచు మ‌నోజ్ హైద‌రాబాద్‌లో పూజ‌లు చేయ‌డంతో వీరి పెళ్లి చేసుకుంటార‌ని కాస్త బ‌లం చేకూర్చింది.

 

హైద‌రాబాద్‌కి చెందిన ప్ర‌ణ‌తీరెడ్డిని 2015లో మ‌నోజ్ పెళ్లి చేసుకున్నారు. ఆ త‌రువాత వీరి జీవితంలో మ‌న‌స్పార్థాలు త‌లెత్త‌డంతో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో వీరిద్ద‌రూ 2019లో వైవాహిక బంధానికి స్వ‌స్తీ ప‌లికారు. ఇక అప్ప‌టి నుంచి మ‌నోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నార‌నే వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్త‌ల‌ను మ‌నోజ్ మాత్రం ఖండిస్తూ వ‌చ్చారు. ఇక భూమా మౌనిక రెడ్డి విష‌యానికొస్తే చిత్తూరు జిల్లాకు చెందిన గ‌ణేష్ బెంగ‌ళూరులో సెటిల్ అయిన గ‌ణేష్ రెడ్డితో మొద‌టి పెళ్లి జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల కింద‌టే మౌనిక‌రెడ్డి-గ‌ణేష్ రెడ్డి దంప‌తులు విడాకులు తీసుకున్నారు. విడాకుల త‌రువాత మౌనిక హైద‌రాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు.


కొద్ది నెల‌ల క్రితం మంచు మ‌నోజ్-మౌనికా చెన్నైలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్డులోని ఓ విల్లాస్‌లో ఉన్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక ఆ త‌రువాత హైద‌రాబాద్‌కి మ‌కాం మార్చారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఇద్ద‌రూ క‌లిసే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే తాజాగా హైద‌రాబాద్ సీతాఫ‌ల్ మండీలోని గ‌ణేష్ మండ‌పంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో వీరు పాల్గొన్నారు. దీంతో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌నే టాక్ మొద‌లైంది. అక్క‌డ ఓ మీడియా ప్ర‌తినిధి మ‌నోజ్‌ని మౌనికారెడ్డిని పెళ్లి చేసుకుంటున్నారా అని ప్ర‌శ్నించ‌గా.. పెళ్లిపై మంచు మ‌నోజ్ మాత్రం నో కామెంట్ అన్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అన్నీ నేనే చెబుతాన‌ని పేర్కొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  అంతటి కష్టం నుంచి దిల్ రాజ్ ను గట్టెక్కించిన బన్నీ.. ఎలాగంటే..?


ప్ర‌స్తుతం హైద‌రాబాద్ మౌనికారెడ్డి-మ‌నోజ్ క‌లిసే ఉన్న‌ట్టు స‌మాచారం. మోహ‌న్ బాబు కుటుంబంతో మ‌నోజ్ కొద్ది నెల‌ల నుంచి దూరంగానే ఉన్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌నోజ్ సినిమా విష‌యానికొస్తే ప్ర‌స్తుతం ఆయ‌న అహం బ్ర‌హ్మాస్మీ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా కరోనా కార‌ణంగా ఆగిపోయింద‌ని, ప్ర‌స్తుతం తాను, ఆ సినిమా ద‌ర్శ‌కుడు వేరే సినిమాల‌తో బిజీగా ఉన్నామ‌ని చెప్పుకొచ్చాడు మ‌నోజ్‌. అహం బ్ర‌హ్మాస్మి సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

ఇది కూడా చ‌ద‌వండి :  ఈ ముగ్గురు న‌టుల విష‌యంలో జ‌రిగిన విచిత్ర‌మైన‌ ఘ‌ట‌న ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading