తెలుగు సినీ ఇండస్ట్రీలలో చాలా మంది లెజెండరీ నటీనటులున్నారు. అందులో ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ వంటి నటుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్ర ఏదైనా ఏదైనా వారి నటన అద్భుతం. కోటశ్రీనివాసరావు చాలా సీనియర్ అయ్యాడు. కానీ ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ఓవైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు నటనలో తన ప్రతిభను కనబరుచుతున్నాడు. ముఖ్యంగా ఈయన పోషించిన పాత్రల్లో నటించడమనే కన్నా జీవిస్తాడనే చెప్పాలి. ప్రకాశ్ రాజ్ చేసే పాత్రల్లో అంతలా లీనమైపోయి నటిస్తాడు.
Also Read : ఆ వాసన ఆ హీరోయిన్ నుంచి మాత్రమే వచ్చేదట.. కారణమేంటంటే..?
Advertisement
తెలుగులో ఉన్నటువంటి దాదాపు అగ్ర దర్శకులందరూ ప్రకాశ్ రాజ్ ని వారి సినిమాల్లో తీసుకున్నారు. కానీ ఎస్.ఎస్. రాజమౌళి మాత్రం విక్రమార్కుడు సినిమాలో ఒక చిన్న పాత్ర 5 నిమిషాల పాటు స్క్రీన్ మీద కనపడే పాత్రలో మాత్రమే ఆయనను తీసుకున్నాడు. ఒక్క సినిమాలో తప్ప రాజమౌళి తీసిన మిగతా ఏ సినిమాలో కూడా ప్రకాశ్ రాజ్ ని తీసుకోలేదు. అసలు రాజమౌళి అంత మంచి నటుడు అయినటువంటి ప్రకాశ్ రాజ్ ని ఎందుకు తీసుకోలేదనే డౌట్ చాలా మందికి ఉంటుంది.
Advertisement
Also Read : విజయశాంతి కోసం బాలకృష్ణ అంతటి త్యాగం చేశారా…?
ఇక ఇదే విషయాన్ని రాజమౌళి వద్ద ప్రస్తావించగా.. “ప్రకాశ్ రాజ్ ఇప్పటివరకు చేయని పాత్ర లేదు. ఆయనను దాదాపు మనం అన్ని పాత్రల్లో చూశాం. తన సినిమాలో కూడా అదే రకం పాత్ర వేస్తే చూసే జనాలకు బోర్ కొడుతుంది. ఇప్పటివరకు ఆయన చేయని పాత్ర ఏదైనా వచ్చినప్పుడు ఆయనతో నా సినిమాలో చేయించుకుంటాను” అని చెప్పారు. రాజమౌళి ఇచ్చే ఎలివేషన్స్ లకి ఆయన సినిమాలలో ప్రకాశ్ రాజ్ విలన్ చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది అనుకుంటారు చాలా మంది. రాజమౌళి సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తే బాగుండేది అనుకుంటున్నారు. ఇక ముందు ముందు అయినా రాజమౌళి సినిమాల్లో నటించే అవకాశం ప్రకాశ్ రాజ్ కి వస్తుందో లేదో వేచి చూడాలి.
Also Read : RRR టీమ్ ఆస్కార్ ప్రయాణ ఖర్చులను భరించింది అతడేనా..?